Begin typing your search above and press return to search.

మోదీ వారి కాళ్లు కడిగారు.. ప్రకాశ్ రాజ్ మోదీని కడిగేశారు

By:  Tupaki Desk   |   25 Feb 2019 6:06 PM IST
మోదీ వారి కాళ్లు కడిగారు.. ప్రకాశ్ రాజ్ మోదీని కడిగేశారు
X
రధాని మోదీ పేరు చెబితే చాలు ఏదో ఒక విమర్శ చేయడానికి రెడీ అయ్యే నటుడు, ఔత్సాహిక రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ తాజాగా కూడా మోదీపై విరుచుకుపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కొందరు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను మోదీ కడగటంపై ప్రకాశ్ రాజ్ విమర్శలు చేశారు. ఇదంతా ఎలక్షన్ గిమ్మిక్కులని కొట్టిపారేశారు.

‘డియర్ సుప్రీమ్ లీడర్..’’ అంటూ ప్రధానిని సంబోధించిన ప్రకాశ్ రాజ్.. ఇలా పారిశుద్ధ కార్మికుల కాళ్లను కడగటం వల్ల వారి జీవితంలో మార్పేమీ రాదని, వాళ్ల బతుకులు బాగు చేసే పనేదైనా చేయాలని సూచించారు.ఇలాంటి చర్యలను చూసి ప్రజలు ఓటు వేస్తారని ప్రధాని భావిస్తున్నారని, ఇది ఆయన చౌకబారు విధానానికి నిదర్శనమని విమర్శించారు. కార్మికుల మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందిస్తే ఓట్లు పడతాయే తప్ప.. ఇలాంటి చర్యల వల్ల కాదని చెప్పారు. ప్రజలు అసహ్యించుకుంటారని అన్నారు.

కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ప్రకాశ్ సూచించారు. కార్మికులు పని చేసే ప్రదేశాల్లో ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పక్కాగా అమలు పరిచేలా చేయాలని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రమాదాలను నివారించడంలో భాగంగా కార్మికులకు మెరుగైన, ఆధునిక పనిముట్లను అందించాలని చెప్పారు. భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. అవన్నీ వదిలేసి, కార్మికుల కాళ్లను కడగటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని అన్నారు.