Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ (టీడీపీ) ఎమ్మెల్యేకు హార్ట్ ఎటాక్

By:  Tupaki Desk   |   26 March 2016 6:14 AM GMT
టీఆర్ ఎస్ (టీడీపీ) ఎమ్మెల్యేకు హార్ట్ ఎటాక్
X
తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలం కొనసాగి.. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సైకిల్ దిగేసి.. కారు ఎక్కిన ఒకప్పటికి టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రకాశ్ గౌడ్ అధికారపార్టీలో చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి.

మొదట్లో కారు ఎక్కేందుకు ససేమిరా అన్నప్పటికీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగా ఇటీవల ఆయన పార్టీ మారారు. శనివారం ఉదయం ఆయన తన సొంతింటిలో గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ప్రకాశ్ గౌడ్ ను హుటాహుటిన నిమ్స్ కు తరలించారు. అత్యవసర వైద్య సేవల్ని అందించిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. సకాలంలో స్పందించి ప్రకాశ్ గౌడ్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించటంతో పెను ప్రమాదం తప్పిందని వైద్యులు చెబుతున్నట్లు చెబుతున్నారు.