Begin typing your search above and press return to search.

మరో తమ్ముడు కారెక్కేశాడోచ్

By:  Tupaki Desk   |   4 March 2016 5:10 PM GMT
మరో తమ్ముడు కారెక్కేశాడోచ్
X
మరో తమ్ముడు కారు ఎక్కేశాడు. ఓపక్క ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతుంటే.. దీనికి ముందు నుంచే తెలంగాణ అధికారపక్షం కూడా ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి చేపట్టిన ఆకర్ష్ తో ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం దాదాపు ఖాళీ అయిన పరిస్థితి. ఆ పార్టీకి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీఆర్ ఎస్ లో చేరుతున్నారన్న వార్త కొద్దికాలంగా వినిపిస్తున్నదే.

ఆ వార్త నేడు నిజమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ప్రకాశ్ గౌడ్ తెలంగాణ అధికారపక్షంలో చేరిపోయారు. ప్రకాశ్ గౌడ్ ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ ఆయన మెడలో గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. ప్రకాశ్ గౌడ్ తో పాటు.. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తెలంగాణ అధికారపక్షంలో చేరిపోయారు.