Begin typing your search above and press return to search.

టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి ఒక టీడీపీ ఎమ్మెల్యే - మాజీ మంత్రి?

By:  Tupaki Desk   |   21 May 2020 6:30 AM GMT
టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి ఒక టీడీపీ ఎమ్మెల్యే - మాజీ మంత్రి?
X
పక్కరాష్ట్రం తెలంగాణలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లు, నాయకులు ఏం చేస్తున్నారో తెలియకుండా పోయింది. ఈ విపత్తు వేళ అన్ని వదిలేసి తన మానాన తను స్వార్థంగా వెళ్లిపోయిన చంద్రబాబు వైఖరిపై ఇప్పటికే టీడీపీ నేతలు ఉడికిపోతున్నారట.. సందు దొరికితే వైసీపీలోకి జంప్ చేయడానికి వేచి ఉన్నారు. కానీ ఇన్నాళ్లు వారిని ఆ మహమ్మారి ఆపేసింది. ఇఫ్పుడు బాబు ఏపీలో లేకపోవడంతో వైసీపీలోకి మళ్లీ టీడీపీ నేతల చేరికకు రంగం సిద్ధమవుతోందని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

మహమ్మారి దెబ్బకు మూడునెలల నుంచి అందరూ అదే పనిలో ఉన్నారు. దీంతో రాజకీయ అలజడి లేదు. తాజాగా అన్ని సర్దుకుంటుండడంతో వైసీపీ తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టినట్టే తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీకి బలంగా ఉన్న నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి వైసీపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది.

ప్రశాశం జిల్లాకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆ జిల్లాకు చెందిన మంత్రి వీరిద్దరితో చర్చించాడని.. వారు ఈనెల 27న వైసీపీలోకి చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఇప్పటికే వైసీపీకి మద్దతు తెలిపారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి చేరేందుకు రెడీ అవ్వడం టీడీపీని ఆందోళనకు గురిచేస్తోంది. మరో ఇద్దరు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో మిగలడం ఆ పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది.

సదురు మాజీ మంత్రి టీడీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు జరిగాయి. కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీంతో టీడీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అధికార వైసీపీలో చేరికకు ఇదే కారణంగా పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక మరో ఎమ్మెల్యే వరుసగా అక్కడ రెండు సార్లు గెలిచాడు. ఆయన ప్రత్యర్థి - వైసీపీ టికెట్ పొందిన సీనియర్ నేత కుటుంబాన్ని వైసీపీ దూరంపెట్టింది. ఈ నేపథ్యంలో ఇదే అవకాశంగా వైసీపీలో చేరేందుకు సదురు టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఫోన్లో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడట..

ఇప్పుడు మరో ఎమ్మెల్యే వైసీపీకి మద్దతిస్తే అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య19కి పడిపోతుంది. ఇప్పటికే ముగ్గురు వైసీపీకి మద్దతిచ్చారు. ఇప్పుడు 27న మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి చేరికతో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.