Begin typing your search above and press return to search.

మహిళల కి అండగా అభయ్ .. ప్రకాశం ఎస్పీ కీలక నిర్ణయం ?

By:  Tupaki Desk   |   6 Dec 2019 12:27 PM IST
మహిళల కి అండగా అభయ్  .. ప్రకాశం ఎస్పీ కీలక నిర్ణయం ?
X
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన అఘాయిత్యాలు , అత్యాచారాలు , దారుణాలు ..మానవ మృగాళ్ల లాంటి కొంతమంది కామాంధులు. మహిళలు ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి , వారిపై అతి కిరాతకంగా దాడికి దిగుతున్నారు. ఈ అఘాయిత్యాలు ఏ ఒక్క జిల్లా కో , ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. మొత్తం యావత్ దేశ వ్యాప్తంగా మహిళ పై రోజు రోజుకి అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయి. ఇకపోతే ఈ మద్యే .. హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ ని నలుగురు కామాంధులు మాటు వేసి .. హత్య చేసి , సజీవ దానం చేసారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికి తెలిసిందే. ఈ ఘటనపై ఒక రకంగా పోలీసులు కూడా కారణం అంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసుల వ్యవహార తీరుపై ఆరోపణలు చేసారు. అయితే ఆ తరువాత పోలీసులు ఈ కేసు ని సీరియస్ గా తీసుకోని ..ఒక పరిష్కారం చూపారు. తాజాగా ఆ నలుగురు నిందుతులని పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు.

ఇక పోతే ఈ దిశ ఘటన జరిగిన తరువాత మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలని అమలు చేయాలని కోరుతున్నారు. దిశ ఘటన జరిగిన తరువాత హైదరాబాద్ మెట్రోలోకి పెప్పర్ స్ప్రే అనుమతించారు. జీరో ఎఫ్‌ఐఆర్.. ఎమర్జెన్సీ, టోల్ ఫ్రీ నెంబర్లు.. తీసుకొచ్చారు. ఈ నేపథ్యం లోనే మహిళల భద్రత కోసం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ..వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. అదే ''అభయ్ డ్రాప్ హోం సర్వీస్''

ఈ అభయ్ డ్రాప్ హోం సర్వీస్ ద్వారా రాత్రి 9 గంటలనుండి తెల్లవారుజాము 5 గంటల వరకు ఒంటరిగా ఉన్న మహిళలకు తోడుగా ఒక మహిళా పోలీస్ ద్వారా వారిని సురక్షితంగా తమ గమ్య స్థానానికి చేర్చబోతున్నారు. అభయ్ వాహనాల్లో డ్రైవర్‌ తో పాటూ మహిళా కానిస్టేబుల్ ఉంటారని తెలిపారు. మహిళలను సురక్షితం గా ఇళ్లకు చేరుస్తామన్నారు. అభయ్ వాహనాలను కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తామని ఎస్పీ వెల్లడించారు. మహిళలు అత్యవసర సమయాల్లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలోనూ మహిళ భద్రత కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చేసి , పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.