Begin typing your search above and press return to search.
జగన్ ముందే మంత్రికి ప్రశంసలు.. పొగడ్తలు.. తర్వాత ఏం జరిగిందంటే..!
By: Tupaki Desk | 21 Sept 2022 10:03 AM ISTసాధారణంగా.. ఏ పార్టీలో అయినా.. అధినేతను పొగడడం తప్పుకాదు.. అసలు పొగడాల్సింది కూడా.. అ ధినేతనే. అలా పొగడకపోతే.. పార్టీలో నాయకులకు ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. అది టీడీపీ నా.. అధికార వైసీపీనా.. అనేది పక్కన పెడితే.. ఎక్కడ ఏ పార్టీలో అయినా. అధినేత భజన అత్యంత కీలకం. అయితే.. అనూహ్యంగా వైసీపీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు అసెంబ్లీలో.. సీఎం జగన్ ఉన్న సమయంలోనే.. మంత్రిని ఒకరు ఆకాశానికి ఎత్తేశారు.
దీంతో సభ మొత్తం.. ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది. ఈ పరిణామం.. ప్రస్తుత సమావేశాల్లోనే చోటు చేసు కుంది. ఓ మహిళా మంత్రి.. కీలకమైన శాఖను చూస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె దూకుడుగా ఉన్నా రు. తన శాఖలో అవినీతిని సహించేది లేదని.. స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు.. సమయానికి ఉద్యోగులు అందరూ హాజరు కావలని.. చెబుతున్నారు. దీంతో సదరు శాఖ పనితీరు సహజంగానే మెరుగు పడిందనే వాదన వినిపిస్తోంది.
దీనిని దృష్టిలో పెట్టుకున్న ఓ నాయకుడు.. సదరు మహిళా మంత్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. అది కూడా అసెంబ్లీలోనే.. అందునా.. సీఎం సమక్షంలోనే. ''డైనమిక్ మినిస్టర్'' అంటూ.. ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.
ఈ పరిణామంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు జగనన్నా.. జగనన్నా.. అంటూ.. సీఎం జగన్‌ను ఆకాశానికి ఎత్తగా.. ఇప్పుడు ఒక్కసారిగా మహిళా మంత్రిపై పొగడ్తలు జల్లు కురిసే సరికి.. అసలు సీఎం జగన్ ఏమనుకుంటారో.. అందరూ ఆయన బెంచ్ వైపు చూశారు.
అయితే.. జగన్ కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. కట్ చేస్తే.. సభ విరామం సమయంలోసదరు మహిళా మంత్రి.. ఎమ్మెల్యేకు ఫోన్ చేశారని తెలిసింది. ఇలా.. తనను సభలో ప్రశంసించడం.. సరికాదని.. ఆమె హితవు పలికారట.
ఆయన తనకన్నా సీనియర్ కావడంతో.. సర్.. అని సంబోధిస్తూ.. మీరు ఇలా ... సభలో పొగడడం సరికాదు. సమస్యలు ఉంటే.. చెప్పండి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను.. అని చెప్పారట. మొత్తానికి ఈ పరిణామం.. వైసీపీలో ఆసక్తికర చర్చకు దారితీయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.