Begin typing your search above and press return to search.

ప్రశంసలు సరే.. నిధుల మాటేమిటి? కేంద్రానికి కేటీఆర్​ సూటి ప్రశ్న

By:  Tupaki Desk   |   22 Jan 2021 5:21 PM IST
ప్రశంసలు సరే.. నిధుల మాటేమిటి? కేంద్రానికి కేటీఆర్​ సూటి ప్రశ్న
X
తెలంగాణ రాష్ట్రంలో కొంత భిన్నమైన రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్​ రూ. వేల కోట్ల అవినీతి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ .. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా కేంద్ర మంత్రులమే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తున్నారు. దీంతో కాంగ్రెస్​ కూడా విమర్శలకు దిగుతున్నది. బీజేపీ, టీఆర్​ఎస్​ మిత్రపక్షాలనేనని.. కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతుంటాయని కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తుంటారు.


ఇటీవల బండి సంజయ్​ సీఎం కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్​ అవినీతిని బయటకు తీస్తామని.. ఆయనను జైలుకు పంపుతామని సంజయ్​ పేర్కొన్నారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి జల్ శక్తి గజేంద్ర సింగ్ షేఖావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. మిషన్​ భగీరథ ఎంతో గొప్పపథకమని కొనియాడారు. రాష్ట్రంలోని 100 శాతం ఇళ్లకు తాగునీరు అందించడం గొప్ప కార్యక్రమని ప్రశంసించారు.

ఎఫ్​హెచ్​టీసీ (ఫంక్షనల్​ హౌస్​ ట్యాప్​ కనెక్షన్​) అంటే ఇంటింటికి 100 శాతం తాగునీటి సౌకర్యం కల్పించడంలో గోవా, తెలంగాణ రాష్ట్రాలు సక్సెస్​ అయ్యాయని ఇటీవల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ గజేంద్ర సింగ్​ షెకావత్​ ఓ ట్వీట్​ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

అయితే ఈ ట్వీట్​పై మంత్రి కేటీఆర్​ స్పందించారు. కృతజ్ఞతలు తెలిపినందుకు ఆయన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక మంత్రికి చురకలు కూడా అంటించారు. ‘ షెకావత్​ జీ మీరు మిషన్​భగీరథ పథకాన్ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు. అయితే మాకు నీతి అయోగ్​ ద్వారా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా అందించలేదు. ఈ విషయాన్ని కూడా కాస్త గుర్తించండి’ అంటూ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.