Begin typing your search above and press return to search.
కోర్టులపై సోషల్ మీడియాలో పోస్టులు..సీబీఐ కేసు నమోదు
By: Tupaki Desk | 16 Nov 2020 11:05 PM ISTఏపీ హైకోర్టు తీర్పులపై అప్పట్లో పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యి సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులను ఏపీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసింది.
జడ్జిలపై వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని.. విచారణ నివేదికను 8 వారాల్లో ఇవ్వాలని సీబీఐకి ఏపీ హైకోర్టు గడువు విదించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు, హైకోర్టులను కించపరిస్తూ జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. జడ్జిలకు దురద్దేశాలు ఆపాదిస్తు పోస్టులు పెట్టిన 16మందిపై కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఎస్పీ విమలాదిత్య తెలిపారు. ఈ అంశంపై ఏపీ సీఐడీ ఇప్పటికే నమోదు చేసిన కేసులను యథాతథంగా తీసుకున్నట్లు చెప్పిన సీబీఐ.. హైకోర్టు ఆదేశాలతో సాధ్యమైనంత త్వరగా కేసులను విచారిస్తామని తెలిపింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు జడ్జిలను ట్రోల్ చేస్తూ కొందరు పోస్టులు పెట్టడం దుమారం రేపింది. ఇప్పటికే ఈ కేసును ఏపీ సీఐడీ విచారించింది. కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో హైకోర్టు సీబీఐకి ఈ కేసును అప్పగించింది. దీనికి సంబంధించి సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 12 రకాల కేసులు నమోదు చేశారు.