Begin typing your search above and press return to search.

పోస్టుమార్టం రిపోర్ట్: విశాఖ చావులు భయంకరం

By:  Tupaki Desk   |   10 May 2020 9:52 AM GMT
పోస్టుమార్టం రిపోర్ట్: విశాఖ చావులు భయంకరం
X
ఊపిరి ఆడదు.. ఏం చేయాలో అర్థం కాదు.. కళ్లు మంట.. శ్వాసతీసుకోం.. క్రమంగా సృహ తప్పి పోవడమే.. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయ్యి చనిపోయిన 12 మంది ఎంత నరకం అనుభవించారనేది పోస్టుమార్టం రిపోర్టులో కళ్లకు కడుతోంది. వీరి చావు చూస్తే ఎంత దారుణంగా చనిపోయారో కన్నీళ్లు పెట్టకమానరు..

విశాఖలోని ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ గ్యాస్ లీక్ అయ్యి 12మంది చనిపోయారు. వేలాది మూగజీవాలు అసువులు బాశాయి. 12మందికి పోస్టుమార్టం చేసి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తాజాగా ఆ 12మంది పోస్టుమార్టం రిపోర్టులు బయటకు వచ్చాయి.

విషవాయువులు పీల్చిన తర్వాత బాధితుల రక్తంలో ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా పడిపోయిందని.. దీంతో ఊపిరి ఆడని పరిస్థితిలో చనిపోయారని విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. 12 మంది ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని.. సున్నితమైన అవయవాలపై విషవాయువు తీవ్రంగా ప్రభావం చూపిందని డాక్టర్లు తెలిపారు.

అయితే స్టైరీన్ గ్యాస్ వల్ల మనుషుల ప్రాణాలు పోవని.. కళ్లమంట - దురద దద్దుర్లు - శ్వాస అందకపోవడం.. మగత కలుగుతాయని.. బహుశా స్టైరీన్ లో వేరొక పదార్థాన్ని కలిపి ఉండొచ్చని.. దాని ప్రభావం వల్లే మనుషులు చనిపోయారని ఆంధ్రా యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ప్రొపెసర్లు చెబుతున్నారు. స్టైరీన్ ఒక కిలోమీటర్ దాటి వ్యాపించదని.. ఏదో ఒక గ్యాస్ కలిపారనే అనుమానాలున్నాయన్నారు. దీనిపై ఎల్.జీ పాలిమర్స్ మాత్రం స్టైరీన్ గ్యాస్ లీక్ వల్లే ప్రమాదం అని అధికారికంగా తెలిపింది.