Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర సీఎం ఆదిత్య థాకరే అంటూ వైరల్ అవుతున్న పోస్టర్స్

By:  Tupaki Desk   |   25 Oct 2019 8:02 AM GMT
మహారాష్ట్ర సీఎం ఆదిత్య థాకరే అంటూ వైరల్ అవుతున్న పోస్టర్స్
X
తాజాగా మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో బీజేపీ - శివసేన కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో మహారాష్ట్రకు కాబోయే సీఎం ఆదిత్య థాకరే అంటూ పెద్ద ఎత్తున పోస్టర్స్ దర్శనం ఇస్తున్నాయి. తొలిసారి వర్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్య థాకరే 65 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

యువసేన - భారీ మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భావి ముఖ్యమంత్రి ఆదిత్య థాకరేకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఎన్నికలలో బీజేపీ తో పొత్తుకు ముందే '50-50' ఫార్ములాను ఆదిత్య థాకరే బీజేపీ ముందు ఉంచారు. భాగస్వామ్య పక్షాలు రెండూ చెరో రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాలని ఆదిత్య తేల్చిచెప్పారు.

మరోవైపు - శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే రాష్ట్రంలోని రాజకీయ పరిణామలపై పార్టీ అగ్రనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికలలో గెలిచినా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించబోతున్నారు. 288 స్థానాలకు జరిగిన అసెంబ్లీకి ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 105 సీట్లు - శివసేన 56 సీట్లు గెలిచింది. ఎన్‌ సీపీ 54 సీట్లతో పార్టీ పట్టు నిలుపుకోగా - ఎన్‌ సీపీ భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం 44 సీట్లు గెలుచుకుంది. దీనితో ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయం వేడెక్కుతుంది.