Begin typing your search above and press return to search.
కమలాకే కాదు.. బైడెన్ కూ చెన్నైతో అనుబంధం
By: Tupaki Desk | 10 Nov 2020 1:20 PM ISTప్రపంచంలో ఏ మారుమూల దేశానికి వెళ్లినా.. అక్కడో తెలుగోడు ఉంటాడన్న నానుడి తరచూ వినిపిస్తూ ఉంటుంది. తెలుగోడి నెట్ వర్క్ అంతలా ఉంటుందని చెబుతుంటారు. దీనికి ఏ మాత్రం తీసిపోని రీతిలో.. భారత్ తో అనుబంధం చాలామందికి ఉన్నట్లుగా చెప్పక తప్పదు. ప్రపంచం పెద్దదే. కానీ.. చాలా సందర్భాల్లో చిన్నదన్న భావన కలిగేలా చేస్తుంది. తాజాగా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ విషయానికి వచ్చినప్పుడు.. ఆయనకు భారత్ తో సంబంధాలు ఉన్నాయని.. ఆయన పూర్వీకులు ముంబైలో ఉన్నట్లుగా బైడెన్ గతంలోనే పలుమార్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు చెన్నై (పాత మద్రాస్) మహానగరంతోనూ సబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా గెలిచిన కమలా హ్యారీస్ తల్లి తమిళనాడుకు చెందిన మహిళ అన్న విషయం తెలిసిందే. తాజాగా బైడెన్ కు తమిళనాడుకు ఉన్న సంబంధాల గురించి చెబుతున్నారు లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ విజిటింగ్ ప్రొఫెసర్ టిమ్ విల్లాసే-విల్సే.
బైడెన్ పూర్వీకులు 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పని చేశారని.. అప్పటి పాత మద్రాసుతో వారికి చాలానే అనుబంధం ఉన్నట్లుగా వెల్లడించారు. లండన్ నుంచి ఇండియాకు వారు ఓడలు తెచ్చేవారని.. ఓడలకు కెప్టెన్లుగా వ్యవహరించేవారని చెబుతున్నారు. బైడెన్ పూర్వీకులైన క్రోస్టోఫర్.. విలియమ్ బైడెన్ సోదరులు ఈస్ట్ ఇండియా కంపెనీలో పని చేసేవారని.. వారిలో క్రిస్టోఫర్ చాలా చిన్నవయసులోనే మరణించగా.. విలియమ్ కు చెన్నైతో చాలా ఎక్కువ అనుబంధం ఉన్నట్లు చెబుతున్నారు.
క్రోస్టోఫర్ బైడెన్ గురించి తమిళనాడులో చాలామందికి తెలుసని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ గ్లోబల్ రిలేషన్ పబ్లికేషన్స్ ఆగస్టులో ప్రచురించిన ఆర్టికల్ స్పష్టం చేస్తోంది. అయితే.. జార్జి బైడెన్ భారత్ లో ఉన్నట్లుగా చెప్పే రికార్డులు మాత్రం లేవని చెబుతారు. ఇంతకీ ఈ జార్జ్ బైడెన్ ఎవరంటే.. బైడెన్ కు వరుసకు ముత్తాత అవుతారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటంతో బైడెన్ సోదరులు (క్రోస్టోఫర్.. విలయమ్స్) ఇద్దరు కష్టసాధ్యమైనప్పటికీ లండన్ నుంచి అప్పటి మద్రాస్ కు ఓడల్ని తీసుకొచ్చేవారు. క్రిస్టోఫర్ మద్రాస్ లోనే కన్నుమూశారని.. అతడి సమాధి చెన్నౌలోని కేథడ్రల్ చర్చిలో ఉందని.. అందుకు సంబంధించిన శిలాఫలకం ఉన్నట్లుగా చెబుతున్నారు.