Begin typing your search above and press return to search.
పాజిటివ్ ఓటింగ్ చీల్చాలంట...వైసీపీ లెక్కలేంటి...?
By: Tupaki Desk | 17 Jan 2023 7:00 AM ISTదేశంలో వరసబెట్టి అధికారంలోకి వచ్చే పార్టీలు చాలా ఉన్నాయి. అలాంటి పార్టీలకు మూల పురుషుడిగా కాంగ్రెస్ ఉంది. కొన్ని దశాబ్దాల పాటు కేంద్రంలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ తప్ప మరో జెండా కనిపించేది కాదు. అది పోటీ రాజకీయం లేని రోజుల మాట. అటూ ఇటూ బలమైన రాజకీయ వ్యవస్థలు ఉన్నా సందర్భాలలో కూడా ఎదురొడ్డి గెలిచిన పార్టీలు ఉన్నాయి. బెంగాల్ లో వామపక్షాలు, గుజరాత్ తో బీజేపీ వంటివి ఉదాహరణలు. మరి అవి అలా కంటిన్యూస్ గా ఎలా గెలుస్తున్నాయంటే వాటిని జనాలు ఓన్ చేసుకున్నారు.
ఆయా పార్టీల పనితీరుతో పాజిటివ్ ఓటింగ్ ని సంపాదించుకున్నాయి అన్న మాట. అపుడు వాటిని ఢీ కొట్టేందుకు విపక్షాలు చేసే ప్రయత్నాలు సరిపోక అవి మళ్లీ మళ్లీ గెలుస్తున్నాయి అన్న మాట. ఏపీలో వైసీపీ కూడా అలాంటి ఎక్సర్ సైజ్ నే చేస్తోంది అంటున్నారు. మరి మూడు దశాబ్దాల రాజకీయం మాది అప్పటిదాకా నేనే సీఎం అని జగన్ పాదయాత్ర వేళే గట్టిగా చెప్పారు.
దానికి తగినట్లుగానే అధికారంలోకి వచ్చాక పావులు కదుపుతున్నారు. రాష్ట్రం ప్రగతిని పక్కన పెట్టి మరీ రాజకీయాలే చేస్తున్నారు అని ప్రత్యర్ధి పార్టీలు అంటున్నా వైసీపీ ఎక్కడా వెనకడుగు వేయలేదు. అప్పులు చేసి మరీ పధకాలను అందిస్తోంది. అలా తన ఓటింగ్ శాతాన్ని బాగా పెంచుకున్నట్లుగా చెబుతోంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు నాయకులు తరచూ అంటున్న మాటలను బట్టి చూస్తే నూటికి ఎనభై శాతం మందికి తమ పధకాలు చేరువ అయ్యాయని, అందువల్ల తామే మళ్లీ గెలుస్తామని.
తమ బలం తమ ఓటింగ్ షేర్ 2024లో 60 శాతానికి తగ్గదని లెక్కలు కడుతున్నారు. 2019 ఎన్నికల్లో శాసనసభలో వైసీపీ ఓటింగ్ షేర్ 50 శాతం వస్తే ఇపుడు మరో పది శాతం పెరిగిందే తప్ప తగ్గదని అంటున్నారు. అదెలా అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకంగ 65 శాతానికి పైగా ఓటింగ్ షేర్ తమకు వచ్చింది అని చెబుతున్నారు. అంటే పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ తోనే తాము రెండవసారి అధికారంలోకి వస్తామని తమ ప్రభుత్వం ఎందుకు కొనసాగాలన్న దాని మీదనే రేపటి ఎన్నికల్లో జనాలు ఓట్లు వేస్తారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే విపక్షాలు మాత్రం రోటీన్ పాలిటిక్స్ తో ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చీలకుండా చూస్తామని చెబుతున్నారని దాని వల్ల తమకు ఏ మాత్రం నష్టం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. తమ సంక్షేమ పధకాలు వాటి ఫలితాల విషయంలో వచ్చిన ఆదరణ వైసీపీకి పెట్టని పెట్టుబడి అని అంటున్నారు. అక్కడ చీలిక వస్తే మాత్రం తాము కంగారు పడాల్సిందే అని అంటున్నారు. అలా కాకుండా విపక్షాలు ఎంతలా కలసినా తమకు పోయేది ఏమీ లేదు అని అంటున్నారు.
ఇక ఏపీలో వైసీపీ అతి పెద్ద సెక్షన్నే పట్టుకుంది అని అంటున్నారు. అలా కాకుండా మిగిలిన సెక్షన్లలో వ్యతిరేకత ఉన్నా బేఖాతరు చేస్తోంది. ఇలా వైసీపీ వ్యతిరేక సెక్షన్లు తీసుకుంటే విద్యావంతులు. తటస్థులు, పట్టణ ప్రాంతం వారు, పధకాలు అందని వారు, మధ్యతరగతి ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరంతా ఎంత కలుపుకున్నా తమ గెలుపు మీద ప్రభావం చూపబోదని వైసీపీ ధీమాగా ఉంది. పైగా ఇందులో ఓటింగ్ కి వెళ్ళేవారు కూడా తక్కువ అని అంచనా కడుతోంది.
అయితే వైసీపీ ధీమాను గమనించే తమకున్న సర్వేలను కూడా దగ్గర పెట్టుకుని తెలుగుదేశం జనసేన ఇపుడు రూట్ మార్చాయి. అందుకే సంక్షేమ పధకాలు తాము రెట్టింపు ఇస్తామని చెబుతున్నాయి. తాజాగా రణస్థలం సభలో పవన్ కళ్యాణ్ అదే చెప్పారు. చంద్రబాబు అయితే మేము ఇంకా ఎక్కువగా పక్ధకాలు ఇస్తామని, తాము వస్తే పధకాలు రద్దు చేస్తామని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం తప్పు అని అంటున్నారు. అయితే చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలు చేస్తారని చెప్పినా జనాలు నమ్మరని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఎవరెన్ని సంక్షేమ పధకాలు అమలు చేసినా కొత్తవారు వచ్చి ఇంకా ఇస్తామంటే జనాలు ఆ వైపు టర్న్ అవుతారు అని కూడా చరిత్ర నిరూపించింది. కాబట్టి విపక్షాలు ఎటూ వ్యతిరేక ఓట్లను గట్టిగా పట్టుకుంటాయి. దాంతో పాటు వైసీపీ నమ్మకం పెట్టుకున్న పాజిటివ్ ఓటింగ్ లో చీలిక తెస్తే మాత్రం వైసీపీకి ఇబ్బందిగానే మారే ప్రమాదం ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.