Begin typing your search above and press return to search.
చిన్నారులపై పంజా విసురుతున్న కరోనా ... 10 లక్షల మంది పిల్లలకి పాజిటివ్ !
By: Tupaki Desk | 17 Nov 2020 1:40 PM ISTకరోనా మహమ్మరి జోరు ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి నిదర్శనమే ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి . అలాగే కరోనా మహమ్మారి వయస్సు తో ఏ సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపుతూ వణికిపోయేలా చేస్తుంది. ఇక అమెరికాలో ఇప్పటివరకు కోటి మందికి పైగా ప్రజలు కరోనా భారిన పడగా ... వారిలో పదిలక్షల మంది వరకు చిన్న పిల్లలు కూడా ఉన్నారని మెరికన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ అండ్ చిల్డ్రన్ హాస్పటిల్ అసోసియేషన్ తెలిపింది.
వీరి అంచనా ప్రకారం నవంబర్ 12 నాటికి అమెరికాలో మొత్తం 1,039,464 మంది చిన్నారులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. కరోనా బారినపడ్డవారిలో 18ఏళ్లలోపు వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. కేవలం వారం సమయంలో ఏకంగా లక్షా పదివేలకు చిన్నారులకి కొత్తగా కరోనా మహమ్మారి సోకింది. అమెరికాలోని పలు కమ్యూనిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందని అమెరికన్ అకాడమీ పెడియాట్రిక్స్ డాక్టర్ గోజా తెలిపారు. మూడు దశాబ్దాలుగా తాను పెడియాట్రిక్ గా పనిచేస్తున్నానని, ఇన్ని ఏళ్లలో లక్షల సంఖ్యలో చిన్నారులు వైరస్ బారినపడటం చాలా బాధాకరం అన్నారు. దీనితో ప్రజల్లో కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించడమే కాకుండా తప్పనిసరిగా మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని గోజా తెలిపారు.
మహమ్మారి సమయంలో అత్యధిక సంఖ్యలో చిన్నారులు వైరస్ బారినపడుతున్నారని, వారితో పాటు కుటుంబాలు, కమ్యూనిటీలు, డాక్టర్లు, ఇతర ఫ్రంట్ లైన్ మెడికల్ బృందాలు కూడా వైరస్ మారినబడుతున్నారు. దీన్ని అరికట్టే సరైన వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని పలు దేశాలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. కరోనా వైరస్ ప్రపంచానకి పాకి 10 నెలలు అవుతోంది. ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు, సేఫ్ డిస్టాన్సుల వంటివి మన జీవితంలో భాగమయ్యాయి. కొన్ని నెలల లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే మామూలు పరిస్థితులు వస్తున్నాయి. ఆలయాలు, మార్కెట్లు షాపింగ్ మాల్స్ అన్నీ ప్రారంభమయ్యాయి. కానీ కరోనా కేసులు పూర్తిగా తగ్గట్లేదు