Begin typing your search above and press return to search.

ప్రపంచం పై కరోనా ఉగ్రరూపం..భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   8 Aug 2020 9:50 AM GMT
ప్రపంచం పై కరోనా ఉగ్రరూపం..భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
X
ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజు రోజుకీ కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి.కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,42,626కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ ప్రపంచ వ్యాప్తంగా ‌గా 7,24,075 మంది క‌రోనా తో కన్నుమూశారు. ఇక‌ ప్రస్తుతం 62,73,913 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,32,68,713 మంది కరోనా ‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక , అగ్రరాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ మరింత వేగంగా విజృంభిస్తుంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,95,524కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,64,094 మంది మృతి చెందారు. కాగా 23,14,463 యాక్టీవ్ కేసులు ఉండగా, 26,16,967 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అమెరికాతో పాటుగా బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఇకపోతే , భారత్ లో కరోనా వ్యాప్తి ఉదృతి కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో భారత్ మూడో స్థానానికి చేరింది. గత 24 గంటల్లో 61,537 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,88,611కి చేరింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 14.27 లక్షల మంది కరోనా నుంచి కోలుకొని డీఛార్జ్ అయ్యారు. మరోవైపు ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా ఇండియా వరుసగా నాలుగో రోజు రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇందులో అమెరికా, బ్రెజిల్ దేశాలను అధిగమించింది.ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 886 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 41,585 మంది మరణించారు.