Begin typing your search above and press return to search.
దేవుడి రాజ్యం మీద పగబట్టిన కరోనా.. టీకా వేసుకున్న 40వేల మందికి పాజిటివ్
By: Tupaki Desk | 12 Aug 2021 7:00 AM ISTదేవుడి రాజ్యంగా కేరళను పిలుస్తారు. అలాంటి ప్రాంతం మీద కరోనా పగబట్టిందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండటం.. అక్కడి ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం పలుజాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు మాత్రం ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నాయి. దేశంలో మరే ప్రాంతంలో లేని విధంగా కరోనా ఆ రాష్ట్రంలో సరికొత్తగా విరుచుకుపడుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మహమ్మారి ఆ రాష్ట్రాన్ని వీడటం లేదు. గడిచిన కొద్ది వారాలుగా రోజుకు 20వేల కేసులకు తగ్గకుండా నమోదవుతున్న ఏకైక రాష్ట్రం కేరళే కావటం గమనార్హం.
మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. టీకాలు రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ బారిన పడటం ఇక్కడ ఎక్కువైంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 40వేల మంది రెండు డోసులు టీకాలు తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడటం అధికారులకు ఏమీ పాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ లపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అలాంటి కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేరళకు సూచనలు చేసింది. వ్యాక్సిన్లు ఇచ్చే రోగ నిరోధక శక్తిని బోల్తా కొట్టించేలా వైరస్ మ్యుటేట్ చెందితే నిజంగానే ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడీ వాదన కేరళ ఎపిసోడ్ లో వినిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాలకు భిన్నమైన పరిస్థితులు కేరళలో ఎందుకు ఉన్నాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
వాస్తవానికి.. కేరళలో కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండటమే కాదు.. అక్కడి పినరయ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. ప్రజలు స్పందించిన తీరు చాలా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారాయి. అలాంటి రాష్ట్రంలో వ్యాక్సిన్ తర్వాత కూడా కేసులు పెద్ద ఎత్తున నమోదు కావటం కొత్త ఆందోళనకు కారణమవుతోంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. తగ్గని కరోనా కేసుల నేపథ్యంలో ఎందుకిలా జరుగుతోంది? బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంట్ కారణమా? లేదంటే ఇంకేదైనా విషయం ఉందా? అన్న అంశంపై స్పష్టత రాని పరిస్థితి. కేరళలో కేసుల నమోదు ఎక్కువగా పతినంతిట్టా జిల్లాలో మొదలయ్యాయి.
ఈ జిల్లాలోనే తొలి డోసు తీసుకున్న తర్వాత దాదాపు 15వేల మంది పాజిటివ్ గా తేలారు. మరో ఐదు వేల మందికి రెండో డోసు కూడా తీసుకున్న తర్వాత పాజిటివ్ గా తేలింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేరళలో చాలా అరుదుగా కనిపించే రీఇన్ఫెక్షన్లు కూడా కనిపిస్తున్నట్లుగా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. క్రమశిక్షణతో వ్యవహరించటం.. ఈ రోజుకు లాక్ డౌన్ తో పాటు.. పెద్ద ఎత్తున ఆంక్షల్ని అమలు చేస్తున్న కేరళ.. ఈ పరిస్థితి నుంచి ఎప్పటికి బయటపడుతుందన్నది ఇప్పుడు సందేహంగా మారింది.