Begin typing your search above and press return to search.
వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి వ్యూహకర్త కావాలా?
By: Tupaki Desk | 29 March 2022 7:00 AM ISTవందేళ్ల చరిత్ర సొంతం. దేశంలోనే అతి పురాతన పార్టీగా ఖ్యాతి. అంతకుమించి.. ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం ముందుకు తీసుకువెళ్లిన, పాలించిన పార్టీగా పేరు. అదే కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఇప్పుడు ఈ పార్టీ అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఎటు చూసినా.. దిక్కుతోచని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి.. ఏ విధంగా మోడీ హవాను ఎదుర్కొని నిలబడాలి? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వ్యూహకర్తల కోసం పార్టీ వెతుకులాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజానికి 1990ల దశకంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొంది. రాజీవ్ హత్య తర్వాత.. పార్టీ ని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. పార్టీలోని వారే .. బయటకు వచ్చి సొంత కుంపట్లు పెట్టుకు ని.. పార్టీని నరనరానా.. జీవచ్ఛవంగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే శరద్ పవార్ వంటి కీలక నాయకులు.. ఎన్సీపీ పేరుతో బయటకు వచ్చి .. సొంత పార్టీ స్థాపించుకున్నారు. అదేసమ యంలో పంజా బ్ నాయకులు కూడా సొంత పార్టీలు పెట్టుకున్నారు. మరీముఖ్యంగా సోనియా.. సారథ్యాన్ని ఇష్టపడి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.
అయినప్పటికీ.. పార్టీ పుంజుకుని సత్తా చాటి.. వరుసగావిజయాలు అందుకుంది. అంతేకాదు.. ఒకానొక దశలో పీవీ నరసింహారావు.. ప్రధానిగా.. ఈ దేశాన్ని సంస్కరణల దిశగా నడిపించి.. దేశాన్ని ఆర్థికంగా పుంజుకునేలా చేసింది. అలాంటి పార్టీ ఇప్పుడు... మోడీకి భయపడిపోతోందనే.. వాదన బాహాటంగానే వినిపిస్తోంది. మరీముఖ్యంగా అసమ్మతి నేతల బృందం(జీ-23)తో తల బొప్పికడుతోందనే వాదన వినిపిస్తోంది. నిజానికి గతంలో అసమ్మతి.. అనే మాట వినిపించడానికే వీలు లేనట్టుగా.. సోనియాచక్రం తిప్పారు.
ఈ క్రమంలోనే ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు ఉదాహరణగా నిలిచాయి. తమ మాటను విస్మరించి న.. వైఎస్ జగన్‌ను కట్టడి చేశారు. మరి అలాంటి పార్టీ.. ఇప్పుడు వ్యూహలేమితో దిక్కులు చూస్తుండడం విచిత్రంగా ఉంది. అంతేకాదు.. వ్యూహాలు ఇచ్చేవారు.. వేసేవారి కోసం.. ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో నిజానికి ఇంత పెద్దపార్టీలో వ్యూహాలు లేవా.. వ్యూహాలు చేసే నాయకులు లేరా? అనేది ప్రధాన ప్రశ్న. ఉన్నారు. కానీ, ఎవరి స్వార్థం వారిది. ఎవరి వాదన వారిది.
ఇవన్నీ పక్కన పెట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదేజరిగిన నాడు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కీలక నాయకుడు.. ఒక వ్యూహకర్తగా మారడం.. పార్టీని నడిపించడం ఖాయం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మరి ఆదిశగా పార్టీ అధినేత్రి...సోనియా.. ఏమేరకు అడుగులు వేస్తోరాచూడాలి.