Begin typing your search above and press return to search.
అతి పెద్ద విషాదం.. ఆ పార్టీ అదృశ్యం...?
By: Tupaki Desk | 12 March 2022 6:00 AM ISTదేశ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రస్థావన లేకుండా కాలం కదిలేది కాదు. శతాబ్దాలను దాటిన చరిత్ర ఆ పార్టీ సొంతం. 1985లో పుట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత వయసు అక్షరాల 137 సంవత్సరాలు. అలాంటి పార్టీ గత ఎనిమిదేళ్ళుగా క్షీణిస్తూ వస్తోంది. నాడు కాంగ్రెస్ చేతిలో పదమూడు రాష్ట్రాలు ఉంటే తాజా ఎన్నికల తరువాత అవి రెండంటే రెండు అయ్యాయి.
ఇక ఓట్లశాతం చూసుకున్నా ఆ క్షీణత బాగా కనిపిస్తోంది. కాలికి బలపం కట్టుకుని గాంధీ వారసురాలు ప్రియాంక యూపీలో రెండేళ్లుగా ఊరూరా తిరిగారు. ఆమె కొత్త శకాన్ని కాంగ్రెస్ కి తెస్తారని అంతా ఆకాంక్షించారు. అయితే ప్రియాంక చూసేందుకు మాత్రమే మామ్మ ఇందిరమ్మ పోలిక తప్ప నాయకత్వం విషయంలో కాదని ఓటర్లు తెల్చేశారు.
ఆ మాటకు వస్తే 2017లోనే కాంగ్రెస్ యూపీలో నయం. ఏడు సీట్లు తెచ్చుకుంది. ఓట్ల శాతం కూడా నాడు ఎక్కువే. ఇపుడు 403 సీట్ల యూపీలో రెండంటే రెండు సీట్లు అంటే అంతకంటే నగుబాటు ఉంటుందా. ఇక రాహుల్ గాంధీకి తోడుగా ప్రియాంకను తెచ్చి అన్నా చెల్లెలుతో కాంగ్రెస్ కి గత వైభవం తెద్దామనుకున్న రాజకీయ వ్యూహం నిలువునా బెడిసికొట్టింది.
పార్టీ తీరు ఏ మాత్రం బాగులేదు అని సీనియర్లు ఏనాడో మొరపెట్టుకున్నారు. 23 మంది సీనియర్లు ఏడాదిన్నర క్రితమే పార్టీ చీఫ్ సోనియాకు లేఖ రాశారు. పార్టీని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని కూడా కోరారు. అయితే వారిని అసమ్మతివాదులుగా ముద్రవేసి దూరం పెట్టారు తప్ప పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోలేదు, దాని పుణ్యమే ఈ భారీ పరాజయం అంటున్నారు.
కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణం అంటే ఉత్తరాఖండ్ లో బీజేపీ కుమ్ములాటలతో అధికారాన్ని బంగారు పళ్ళెంలో తెచ్చి ఇవ్వాలనుకున్నా అందుకోలేని దౌర్బల్యాన్ని ఎలా వర్ణించాలి అని అంటున్నారు. ఇక గోవాలో కాంగ్రెస్ ఎపుడూ అతి పెద్ద పార్టీయే. అక్కడ నలభై శాతానికి పైగా మైనారిటీ ఓటర్లు, సంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ కే జై కొడతారు. అలాంటి చోట కూడా ఫస్ట్ టైమ్ బీజేపీ కంటే తక్కువ సీట్లు తెచ్చుకుంది.
ఇక మణిపూర్ ఈశాన్య రాష్ట్రం. అక్కడ కూడా మైనారిటీలు కాంగ్రెస్ కే పట్టం కడతారు 2017లో అదే జరిగింది. 28 సీట్లతో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉంది బీజేపీ 21 సీట్లతో రెండవ స్థానంలో ఉంది. అలాంటిది కాంగ్రెస్ అక్కడ అరడజన్ సీట్లకు పడిపోతే బీజేపీ గతం కంటే 12 సీట్లను ఎక్కువగా గెలుచుకుని సొంతంగా అధికారంలోకి వచ్చింది.
అటు యూపీ నుంచి మొదలుపెడితే బీజేపీ ఓట్ల షేర్ అన్ని రాష్ట్రాల్లో బాగా పెరిగింది. అదే టైమ్ లో కాంగ్రెస్ ఓటింగ్ బాగా తగ్గిపోతోంది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సిది ఏంటి అంటే కాంగ్రెస్ పట్ల జనాలు వైముఖ్యం ప్రదర్శిస్తున్నారనే. ఆ పార్టీ జనాల్లోకి సరిగ్గా వెళ్లలేకపోతోంది అనే.
దీని మీద సీనియర్ నేత గులాం నబీ అజాద్ అయితే ఆవేదనతో కూడిన ప్రకటన చేశారు. తన కళ్ల ముందే కాంగ్రెస్ ఇలా పతనం కావడం గుండెలను పిండేస్తోంది. రక్త కన్నీరే కారుతోంది అని అన్నారు. తన యవ్వనం, జీవితం మొత్తం కాంగ్రెస్ కే దారాదత్తం చేశానని ఇపుడు అలాంటి పార్టీ ఇంత వేగంగా పతనం కావడం సహించలేని విషయమని అజాద్ అంటున్నారు.
ఇక ఎన్నికల ఫలితలను ముందే ఊహించారో ఏమో తెలియదు కానీ సీనియర్ మోస్ట్ నేత కేరళకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఏ కే ఆంటోనీ కాంగ్రెస్ కి ముందే గుడ్ బై కొట్టేసారు. తాను ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లుగా ఆయన సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే సీనియర్లు అయితే కళ్ళ ముందే కాంగ్రెస్ పతనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇక రాహుల్ గాంధీ అయితే ఎప్పటిమాదిరిగానే కాంగ్రెస్ జనాల తీర్పుని స్వీకరిస్తోంది అని ఒక్క మాటతో సరిపెట్టేశారు.
మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ముక్త భారతం అని బీజేపీ నేతలు అన్నా అది ఒక రాజకీయ నినాదంగానే చూశారు. కానీ వారి ఊహలను కూడా తల్లకిందులు చేస్తూ తనకు తానుగా దేశ రాజకీయ ముఖ చిత్రం నుంచి కాంగ్రెస్ వేగంగా అదృశ్యం అవుతున్న తాజా ఉదంతం మాత్రం దేశ రాజకీయ చరిత్రలో అతి పెద్ద విషాదమే.
ఎందుకంటే కాంగ్రెస్ అనే పార్టీ ఈ దేశాన ఉండాలి. ఆ పార్టీ భారతదేశం గుండె చప్పుడు. అన్నివర్గాల అన్ని ప్రాంతాలతో కూడిన అందరి పార్టీ కాంగ్రెస్. అలాగే దేశాన ఎంతో విలువ గౌరవం ఉన్న పార్టీ. కాంగ్రెస్ లేని దేశ రాజకీయం అంటే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదంగా భావించడమే అని రాజకీయ మేధావులు అనే మాట.