Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: పోసాని ఇంటిపై రాళ్లదాడి.. అర్ధరాత్రి రచ్చ

By:  Tupaki Desk   |   30 Sept 2021 12:20 PM IST
బ్రేకింగ్: పోసాని ఇంటిపై రాళ్లదాడి.. అర్ధరాత్రి రచ్చ
X
జనసేనాని పవన్ కళ్యాణ్ పై బూతులతో తీవ్ర విమర్శలు చేసిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగినట్టు తెలిసింది. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలకు కౌంటర్ గా పోసాని ఇటీవల రెండు ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రంగా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ నుంచి అతడికి బెదిరింపులు రావడం.. ప్రెస్ మీట్ కొచ్చిన పోసానిపై జనసైనికులు దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.

ఈక్రమంలోనే పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. తనకు ప్రాణహాని ఉందని.. ఏం జరిగినా పవన్ దే బాధ్యత అని పోసాని మీడియా ముందు వచ్చి వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే తాజాగా పోసాని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అమీర్ పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై దుండుగులు రాళ్ల దాడి చేశారు. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ దాడిలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోసాని ఇంటి వాచ్ మెన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

గత ఎనిమిది నెలలుగా పోసాని కుటుంబం అక్కడం ఉండడం లేదు. వేరే చోట నివాసముంటున్నారు. ఘటనపై పోసాని వాచ్ మెన్ సంజీవ్ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన సంచలనమైంది.