Begin typing your search above and press return to search.

పోర్న్ చూడటం లో మన తర్వాతే ఎవరైనానట

By:  Tupaki Desk   |   3 Jan 2020 4:52 AM GMT
పోర్న్ చూడటం లో మన తర్వాతే ఎవరైనానట
X
ఓ పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం అశ్లీల వీసీడీలు తెచ్చుకొని ఎవరూ లేనప్పుడు పెట్టుకొని యువత గుట్టు గా చూసేవారు.. కానీ ఇప్పుడు అంతా బహిరంగం.. స్మార్ట్ ఫోన్ వచ్చాక విశృంఖలం గా సెక్స్ వీడియోల వీక్షణ పెరిగిపోయింది.

అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య చాలా పెరిగి పోయింది. దేశంలో పోర్న్ వెబ్ సైట్ల పై నిషేధం ఉన్నా అవి ఫోన్లలో వచ్చేస్తూనే ఉన్నాయి.

షాకింగ్ విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ నీలిచిత్రాలు (సెక్స్ వీడియోలు) చూసే ప్రజల్లో మన భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారని ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ సంచలన విషయం తెలియజేసింది. ప్రపంచంలో ప్రతి నలుగురిలో ముగ్గురు మొబైల్ లో పోర్న్ చూస్తున్నారని తేల్చింది. కంప్యూటర్ల పై చూసే వారి సంఖ్య బాగా తగ్గిందట.. అందరూ సౌకర్యం గా ఉండే ఫోన్లోనే చూస్తున్నారట..

ఈ పోర్న్ అత్యధికం గా చూసే వారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, జపాన్ వాసులు నిలిచారు..

ఇక పోర్న్ వీడియోలు చూడడం లోనే కాదు.. మన దేశంలో మొబైల్ డేటా వినియోగంలోనూ రికార్డు బద్దలైంది. నెలకు సగటున ఓ వ్యక్తి ఏకంగా 9.8 జీబీ వినియోగిస్తున్నారని తేలింది.