Begin typing your search above and press return to search.
పోర్న్ వీడియో లింకుల కలకలం.. ఐదుగురు చానల్ ఉద్యోగులపై వేటు
By: Tupaki Desk | 15 Dec 2020 11:14 AM ISTశ్రీవేంకటేశ్వర భక్తి చానల్.. చిన్నగా చేసి చెప్పాలంటే ఎస్వీబీసీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ చానల్ లో అధ్మాత్మిక కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ప్రసారం చేస్తుంటారు. శ్రీవారి సేవతో పాటు.. హిందుత్వ గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రోగ్రాంలు టెలికాస్ట్ చేసే ఈ చానల్ ఉద్యోగుల నుంచి ఏ మాత్రం ఊహించని వ్యవహారాలు ఇటీవల బయటకు వచ్చి సంచలనంగా మారాయి. ఈ చానల్ లో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన వీడియో లింకుల కోసం ఒక వీక్షకుడు మొయిల్ చేయగా.. అతడికి. పోర్న్ వెబ్ సైట్ల లింకులు పంపారు ఉద్యోగులు.
దీంతో.. షాక్ తిన్న అతడు చేసిన ఫిర్యాదుతో ఎస్వీబీసీ ఉలిక్కిపడింది. అంతర్గత విచారణ చేపట్టగా.. చానల్ లో పని చేసే ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో పాడు వీడియోలు చూస్తుంటారన్న దారుణం బయటకు వచ్చింది. అధ్యాత్మిక చానల్ లో పని చేస్తూ.. ఈ పాడు పనేమిటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై మరింత సీరియస్ అయిన టీటీడీ.. అసలు దొంగల్ని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ టీంను రంగంలోకి దించింది.
దీంతో వారు జరిపిన విచారణలో ఈ ఇష్యూకు సంబంధం ఉన్న ఐదుగురు ఉద్యోగుల్ని తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇక.. పోర్న్ వీడియో లింకులు పంపిన ఉద్యోగిని అప్పట్లోనే తొలగించగా.. ఈ ఇష్యూతో సంబంధం ఉన్న మరో ఐదుగురి పైన తాజాగా వేటు వేశారు. ఈ ఐదుగురు తమ విధి నిర్వహణ సమయంలోనూ పోర్న్ వీడియోలు చూస్తారని గుర్తించారు. వీరిలో వీడియో ఎడిటర్లు.. గ్రాఫిక్ డిజైనర్లుఉన్నట్లు గుర్తించారు. మేనేజర్ స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు ఉండటం గమనార్హం. మొత్తానికి పోర్న్ లింకులు పలువురి కొలువుల్ని పోయేలా చేశాయని చెప్పక తప్పదు.