Begin typing your search above and press return to search.
'అదర్ పూనావాలా' కొత్త ఆఫీస్ .. ఎన్ని కోట్లంటే ?
By: Tupaki Desk | 7 Sept 2021 11:02 AM ISTసీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత అదర్ పూనావాలా ఈ పేరు కి ప్రస్తుతం పరిచయం అక్కర్లేదు. గతంలో సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత అదర్ పూనావాలా అంటే ఎదో వ్యాపారవర్గాలకు మాత్రమే తెలుసు. కానీ, కరోనా వ్యాక్సిన్ తయారీ తర్వాత అదర్ పూనావాలా పేరు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవ్వడంతో సామాన్యులు కూడా అయన గురించి తెలుసుకున్నారు. ఆయనకు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ ఐఐ) కొవిడ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తుండటం వల్ల పూనావాల గురించి అందరికీ తెలిసింది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన వార్త ఉంటే, ఈయన ప్రస్తావన ఉండాల్సిందే. అదర్ పూనావాలా ప్రధాన వ్యాపార విభాగం ఎస్ ఐఐ అయినప్పటికీ.. పలు ఇతర వ్యాపారాలను కూడా ఆయన సాగిస్తున్నారు. అందులో ఒకటి పూనావాలా ఫినాన్స్. అదర్ పూనావాలా ఫినాన్స్ వ్యపారాలకోసం ఇటీవల ఓ కొత్త ఆఫీస్ ను కూడా కొనుగోలు చేశారు. దీని విలువ రూ.464 కోట్లుగా అంచనా. ఆ ఆఫీస్ అంత ఖరీదు ఎందుకు, దానిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాలని చూద్దాం ...
ఆఫీస్ ప్రత్యేకతలు..
పుణెలోని ఏపీ81 టవర్స్ లో.. 13 ఫ్లోర్లలో ఈ ఆఫీస్ ఉంది. ఇది 2023 నుంచి వినియోగంలోకి రానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే స్థలంతో కలిపి ఈ బిల్డింగ్ 19 అంతస్తులు ఉంటుంది. ఈ మొత్తం బిల్డింగ్ లో మొదటి, రెండవ అంతస్తులను ఇంతకు ముందే కొనుగోలు చేసింది పూనావాలా ఫినాన్స్ కంపెనీ.ఆఫీస్ కోసం వినియోగించే ఫ్లోర్లు మినహా.. మిగతా స్థలాన్ని పార్కింగ్ కోసమే కేటాయించారు.
సకల సౌకర్యాలతో ఇది వినియోగంలోకి రానుంది. ఈ ఆఫీస్ ఈ డీల్ కోసం.. రూ.27.82 కోట్లను కేవలం స్టాంప్ డ్యూటీగా పూనావాలా చెల్లించినట్లు ప్రముఖ బిజినెస్ వార్తా సంస్థ రాసుకొచ్చింది. దీన్ని బట్టే ఆఫీస్ ఎంత ఖరీదైందో అర్థం చేసుకోవచ్చు. పుణెలో అత్యంత ధనవంతుల్లో అదర్ పూనావాలా కూడా ఒకరు. పుణెలోని ఇప్పుడున్న ఆఫీస్ లో ఆయన వ్యక్తిగత క్యాబిన్ ప్రస్తుతం ఎయిర్ బస్ ఏ320 విమానంలో ఉండటం విశేషం. వింతగా ఉన్నా ఆయనకు విమానాలపై ఉన్న ఆసక్తి కారణంగా ఇలా ఎయిర్ క్రాఫ్ట్ నే తన ఆఫీస్ గా మలుచుకున్నారు. దీని విలువ రూ.7.3 కోట్లుగా అంచనా. అదర్ పూనావాలా అభిరుచికి తగ్గట్లు అన్ని రకాల లగ్జరీ సదుపాయాలు ఇందులో ఉంటాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న సంస్ధగా సీరం సంస్థకు పేరుంది. పూణే కేంద్రంగా పని చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ తొలిసారిగా కోవిషీల్డ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ కూడా కరోనా నియంత్రణలో ఉపయోగిస్తున్నారు.ఈ కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ను మిక్స్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా ప్రతిపాదనలు వస్తున్నాయి. దాని వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. తాజాగా కేంద్రం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ల మిక్సింగ్‌కు సంబంధించి సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత సైరస్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19 వ్యాక్సిన్లను మిక్ చేయడం తప్పు అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీని వల్ల సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లను మిక్స్ చేయడానికి సంబంధించి ఏదైనా తేడా జరిగితే అప్పుడు కంపెనీలు ఒకరి మీద మరొకరు బురద జల్లే ప్రమాదం తలెత్తుతుందని సీరం చీఫ్ సైరస్ పూనావాలా హెచ్చరించారు.