Begin typing your search above and press return to search.

ష‌ర్మిల చెంత‌కు పొంగులేటి?

By:  Tupaki Desk   |   2 Feb 2023 9:50 PM GMT
ష‌ర్మిల చెంత‌కు పొంగులేటి?
X
ఖ‌మ్మం మాజీ ఎంపీ.. బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పొలిటిక‌ల్ ఇష్యూ కీల‌క మ‌లుపు తిరుగుతోందా? పోయిపోయి ఆయ‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేర‌నున్నారా? ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్ త‌న‌య ష‌ర్మిల పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే.. సాక్షాత్తూ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిలే ఔన‌ని చెప్పారు. త‌న‌కు పొంగులేటి మాట కూడా ఇచ్చార‌ని ష‌ర్మిల చెప్ప‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

కొన్నాళ్లుగా బీఆర్ ఎస్‌పై కారాలు మిరియాలు నూరుతున్న పొంగులేటి.. బీఆర్ ఎస్ ఆవిర్భావ స‌భ‌కు పోటీ గా స‌భ కూడా పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. త‌న‌కు పార్టీలో అవ‌మానాలు జ‌రుగుతున్నాయ‌ని.. త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. నిజానికి నామా నాగేశ్వ‌ర‌రావు బీఆర్ ఎస్ ఎంట్రీతో పొంగులేటి ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఒక‌ప్పుడు ఖ‌మ్మంలో చ‌క్రం తిప్పిన పొంగులేటి.. వైసీపీ త‌ర‌ఫున 2014 ఎన్నిక‌ల్లో ఎంపీగా విజ‌యం ద‌క్కించుకున్నారు.

త‌ర్వాత బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మొద‌ట్లో బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. నామా ఎంట్రీకి తోడు గ్రూపు రాజ‌కీయాలు పొంగులేటిని పార్టీలో ఏకాకిని చేశాయి. ఫ‌లితంగా ఆయ‌న చూపు బీజేపీపై ప‌డింద‌నే వాద‌న కూడా వినిపించింది. అయితే.. ఇంత‌లోనే ష‌ర్మిల చేసిన తాజా ప్ర‌క‌ట‌న‌.. ఒకింత సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను కూడా ఖ‌మ్మం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని.. ఇటీవ‌ల ష‌ర్మిల శ‌ప‌థం చేసిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఈ జిల్లాలో కార్య‌క‌లాపాల‌ను ఆమె ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక‌, ఇటీవ‌ల పొంగులేటి ష‌ర్మిల‌తో బేటీ కావ‌డం.. వీరి మ‌ధ్య కొన్ని కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం కూడా ప్రాధాన్యం సంత‌రించు కున్నాయి. ఇప్పుడు ఏకంగా పార్టీలో చేర‌నున్నార‌ని ష‌ర్మిల చేసిన ప్ర‌క‌ట‌న‌తో పొంగులేటి.. వ్యూహం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి పైకి ప్ర‌క‌ట‌న‌ల వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ష‌ర్మిల పార్టీ కి క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేదు. మ‌రి అన్నీ తెలిసి.. పొంగులేటి వెళ్తున్నారా? లేక‌.. పొంగులేటి పేరుతో త‌ను హైలెట్ కావాల‌ని ష‌ర్మిల ఆపేరు వాడుకుంటున్నారా.. అనేది ఆస‌క్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.