Begin typing your search above and press return to search.

మధిరలో 91.27% - మలక్ పేటలో 40%

By:  Tupaki Desk   |   8 Dec 2018 10:56 AM IST
మధిరలో 91.27% - మలక్ పేటలో 40%
X
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. తెలంగాణ వ్యాప్తంగా 69.1శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలోనే అత్యధికంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఓటర్లు ఓట్ల వాన కురిపించారు. ఇక్కడ 91.27శాతం పోలింగ్ నమోదై.. తెలంగాణలోనే ఆల్ టైం రికార్డును సృష్టించింది. ఇక హైదరాబాద్ పరిధిలోని మలక్ పేటలో అత్యత్పంగా 40శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత అత్యల్పం చూస్తే ఎల్బీనగర్ లో 42శాతం - యాకుత్ పురలో 41.75శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

మధిర తర్వాత రెండో అత్యధిక పోలింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులో 90.97శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత వరుసగా మునుగోడులో 90.88శాతం - నర్సంపేటలో 90.10శాతంతో తరువాతి స్థానాల్లో నిలిచాయి.

గిరిజనులు - గ్రామీణులు ఉన్న ఖమ్మం - ఆదిలాబాద్ జిల్లాలో జనాలు ఓటేసేందుకు పోటెత్తారు. చదువుకున్న వారు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో ఓటర్లు మాత్రం ఓటేయడానికి ఆసక్తి చూపలేదు. అందుకే గ్రామీణ జనాభా ఉన్న ప్రాంతంలోనే అత్యధిక పోలింగ్ నమోదు కావడం విశేషంగా చెప్పవచ్చు.


Source: Sakshi.com