Begin typing your search above and press return to search.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటేసిన ప్రముఖలు
By: Tupaki Desk | 9 Oct 2020 5:00 PM ISTనిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపు 50 కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు వస్తున్నారు.
సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఈ ఉప ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ తరుపున నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వి.సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.
కరోనా పాజిటివ్ కారణంగా 24 మంది ఓటు వేసే అవకాశం లేదు. దీంతో వారికి చివరి గంటలో ఓటువేసే అవకాశం కల్పించారు. కరోనా బాధితుల కోసం పీపీఈ కిట్లు, అంబులెన్స్‌లను రెడీగా ఉంచారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 824 మంది ఓటర్లున్నారు. 483 మంది జిల్లా ఓటర్లు కాగా, 341 మంది కామారెడ్డి జిల్లావారు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో 67ఓట్లు ఉండగా, చందూర్‌లో నలుగురు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుకోనున్నారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్, 14 సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో షూటింగ్‌తో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో 399 మంది పాల్గొన్నారు.
మొత్తం 824మంది ఓటర్లు ఉండగా.. 413మంది ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కితే విజయం వరిస్తుంది. టీఆర్ఎస్ కు 504మంది ప్రజాప్రతినిధులు ఉండడంతో కవిత గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మిత్రపక్షం ఎంఐఎంకు చెందిన 28మంది కూడా టీఆర్ఎస్ కే మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ కు 142మంది మాత్రమే ప్రజాప్రతినిదులున్నారు.
నిజామాబాద్ జడ్పీ కేంద్రంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తొలి ఓటు వేశారు. ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు 28మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో కవిత గెలుపు ఖాయం అని అన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి కవిత కామారెడ్డికి చేరుకొని పోలింగ్ బూత్ ను పరిశీలించారు. ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి భోధన్ నిజామాబాద్ లలో పరిశీలించారు.
