Begin typing your search above and press return to search.
17 ఏళ్ల కుర్రాడికి పోలింగ్ డ్యూటీ.. ఈ ఘనత ఎవ్వరిదో..!
By: Tupaki Desk | 3 Dec 2020 5:00 PM ISTగతంలో ఎప్పుడూ జరగని ఓ అద్భుతం ఇటీవల నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చోటుచేసుకున్నది. బహుశా ఎన్నికల సంఘం ఆవిర్భావం అనంతరం ఎప్పుడూ ఇటువంటి ఘటన జరిగిఉండదేమో. సహజంగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ఎన్నికల విధులు నిర్వర్తిస్తుంటారు. వాళ్ల వయసు దాదాపు 25 సంవత్సారాలు పైబడే ఉంటుంది. కానీ తొలిసారిగా ఓ 17 ఏళ్ల కుర్రాడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్లో ఈ ఫోటొను షేర్ చేసుకున్నాడు. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ తెలంగాణలో నిరుద్యోగం ఉందని అందరూ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి 17 ఏళ్లకే ఓ కుర్రాడు ఎన్నికల డ్యూటీని పొందగలిగాడు’ అంటూ ఓ నెటిజనుడు వ్యంగ్యగా స్పందించారు. ‘ తెలంగాణ దేశంలో నంబర్‌వన్ స్టేట్ ఇక్కడ ఏదైనా సాధ్యమే’ అంటూ మరోకరు కామెంట్ పెట్టాడు. అయితే నిజంగా ఆ కుర్రాడికి ఎలా ఎన్నికల డ్యూటీ వేశారు. అతడు నిజంగా ప్రభుత్వ ఉద్యోగి అయితే అంత చిన్న వయసులో ఉద్యోగం ఎలా వచ్చింది. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయా? అన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ ఫొటో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది.
ఇటువంటి అనుభవం లేని వాళ్లు పోలింగ్ డ్యూటీ చేశారు కనుకే .. ఎమ్మెల్సీ కవిత గతంలో నిజామాబాద్ జిల్లా పోతంగల్లో ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఓటు వేయగలిగారని కొందరు ఆరోపించారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. గత ఏడాది ఓటు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం రాలేదు. మరోవైపు సీఎం కేసీఆర్ కూతురు.. ఎమ్మెల్సీ కవిత.. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్లో ఇప్పుడేమో జీహెచ్ఎంసీలో ఎలా ఓటు వేశారంటూ పలువురు ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ఎన్నికల సంఘం నిర్లక్ష్యమేనని ఆరోపించారు.