Begin typing your search above and press return to search.

ద‌మ్ముంటే ఈవీఎంల ట్యాంప‌ర్ నిరూపించండి

By:  Tupaki Desk   |   5 April 2017 5:16 AM GMT
ద‌మ్ముంటే ఈవీఎంల ట్యాంప‌ర్ నిరూపించండి
X
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) గోల్‌ మాల్ జరుగుతోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరిస్తోంది. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్లకంటే ఈవీఎంలే సౌకర్యవంతమని నొక్కిచెప్తోంది. దమ్ముం టే ఈవీఎంలతో గోల్‌ మాల్ చేయొచ్చు అని నిరూపించండి అంటూ సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈవీఎంలలో గోల్‌ మాల్ జరుగుతుందంటూ వివిధ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియలోని ఇబ్బందులను వివరిస్తామని ఎన్నికల సంఘానికి చెందిన ఓ అధికారి తెలిపారు. బ్యాలెట్ పేపర్లను వినియోగించడంలో ఉన్న ఇబ్బందులను, ఈవీఎంలతో సౌకర్యాన్ని చెప్తామన్నారు.

ఇటీవలి ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో గోల్‌ మాల్ జరిగిందంటూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. `72 గంటల సమయం ఇవ్వండి. సాఫ్ట్‌ వేర్‌ ను బయటపెట్టి, ఎలా టాంపర్ చేయొచ్చో చెబుతా` అంటూ సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వినియోగించాల్సిన అవసరాన్ని వివరించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలొచ్చాక బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి చెందిన అధికారి ఒక‌రు మాట్లాడుతూ పదేళ్ల‌ కిందట ఈవీఎంలపై రాజకీయ పార్టీల నాయకులు ఇదే తరహా ఆరోపణలు చేశారని, అన్ని పార్టీల ప్రతినిధులను పిలిచి అవి పనిచేసే విధానాన్ని వివరించడంతోపాటు టాంపరింగ్ సాధ్యమైనట్లయితే చేసి చూపించాలని విజ్ఞప్తి చేశామని, కానీ అది సాధ్యం కాలేదన్నారు. అవరసరమైతే త్వరలో మరోసారి ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాలెట్ పేపర్లను వినియోగించడానికి మళ్లీ చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేదని అధికారి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/