Begin typing your search above and press return to search.

పోలీస్ బాస్ తో నేత..1000కోట్ల స్థలంపై కన్నేశారు

By:  Tupaki Desk   |   14 Oct 2019 10:48 AM GMT
పోలీస్ బాస్ తో నేత..1000కోట్ల స్థలంపై కన్నేశారు
X
బ్రిటీషర్లు 1883లో ఏర్పాటు చేసిన క్లబ్ అదీ.. విశాఖకే మణిహారంగా నిలిచే ‘వాల్తేరు క్లబ్’లో చేరాలంటే మాత్రం సామాన్యులకు తలకు మించిన భారమే.. ఎందుకంటే జీవితకాల సభ్యత్వానికి రూ.25 లక్షలు - సాధారణ సభ్యత్వానికి రూ.10 లక్షలు కట్టాలి. ఈ క్లబ్ లో సభ్యత్వాన్ని ధనవంతులు - ఉన్నతాధికారులు - ప్రముఖ వ్యాపారులు - పలువురు నాయకులు మాత్రమే తీసుకుంటారు.. అయితే ఈ క్లబ్ లో పేకాట ఆడి - మద్యం తాగి ఇతర ఇల్లీగల్ పనులు చేయడానికి వీల్లేదు. ఈ క్లబ్ కుటుంబ సభ్యులతో సహా అంతా వచ్చి ఓ పండుగలా సంప్రదాయ కార్యక్రమాలు చేసుకోవడానికి ఏర్పాటు చేసింది.

అయితే ఈ క్లబ్ పై ఓ ఖద్దరు కన్నుపడింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకుడు విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న ఈ వాల్తేరు క్లబ్ లో చేరడానికి నిర్ణయించుకున్నాడట.. అయితే సంస్థపై ఆరాతీయగా ఈ క్లబ్ ఉన్న స్థలం సంస్థది కాదని తేలింది. 99 ఏళ్లు లీజుకు తీసుకున్నదని తెలిసింది. ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయింది కూడా.. అయినా ఖాళీ చేయకుండా క్లబ్ యజమానులు కోర్టుకు ఎక్కారు. ప్రస్తుతం క్లబ్ నిర్వాహకులకు - భూ యజమానులకు మధ్య సివిల్ కేసు పదేళ్లుగా కోర్టులో నడుస్తోంది.

సువిశాలమైన విశాఖలోని వాల్తేరు క్లబ్ ధర అక్షరాల వెయ్యికోట్లకు పైగానే ఉంటుంది. వివాదాల్లో ఉండడంతో ఈ విలువైన స్థలాన్ని అమ్మడానికి హక్కుదారులు ప్రయత్నిస్తున్నా కోర్టు కేసుతతో ఎవరూ కొనడం లేదట..

దీంతో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఈ క్లబ్ ను ఖాళీ చేయించి తాము తీసుకుంటామని యజమానులతో డీల్ సెట్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక అనుకున్నదే తడువుగా ఆ రాజకీయ నాయకుడు ఓ పోలీస్ ఉన్నతాధికారిని రంగంలోకి దింపి క్లబ్ నిర్వాహకులపై బెదిరింపులకు దిగాడట.. క్లబ్ లో అనైతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ బెదిరించారట.. అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తానని క్లబ్ నిర్వాహకులను అదిలించాడని టాక్.

దీంతో ఈ క్లబ్ నిర్వాహకులు ఈ విషయాన్ని మరో ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆయన పోలీసు ఉన్నతాధికారిని కలిసి నచ్చచెప్పారు. దీంతో సదురు పోలీస్ బాస్ వెనక్కి తగ్గాడట.. తన పార్టీకే చెందిన నేత.. ఇలా క్లబ్ ను చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలిసి ఈ విషయాన్ని అధిష్టానం చెవిలో వేశాడట.. దీంతో ఈ వాల్తేరు క్లబ్ హైజాక్ వ్యవహారం ఆనోటా ఈనోటా లీక్ అయ్యింది. వెయ్యి కోట్ల వాల్తేరు క్లబ్ ను స్వాధీనం చేసుకోవడానికి సదురు నేత చేస్తున్న ప్రయత్నాలు బయటకు పొక్కాయి.