Begin typing your search above and press return to search.
బీసీల కోసం తొందరలోనే రాజకీయ పార్టీ!
By: Tupaki Desk | 2 Nov 2020 4:00 PM ISTరాష్ట్రంలో తొందరలోనే ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది. అయితే ఇది మామూలు రాజకీయపార్టీలాగ కాకుండా కేవలం కులం ఆధారంగానే ఏర్పాటవుతోంది. సమాజంలో అత్యధిక జనాభా బీసీ సామాజికవర్గాలే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడున్న రాజకీయ పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరి బీసీ కోటాలో సీట్లు, పదవులు సాధించుకోవటాన్ని బీసీ నేతలు అవమానంగా భావిస్తున్నారు. అందుకనే తామే ఓ పార్టీ పెట్టేసి మొత్తం బీసీలనే పోటిలోకి దింపితే సరిపోతుందని ఏపి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అభిప్రాయపడ్డారు.
ఇదే విషయమై బీసీ కులాలత నేతలతో అనేక సమావేశాలు జరిపిన తర్వాత చివరకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో పెద్ద సమావేశం జరిగింది. తర్వాత బీసీల కోసం కొత్తగా రాజకీయపార్టీ పెట్టబోతున్నట్లు శంకర్ ప్రకటించారు. బీసీల్లో సుమారు 140 ఉపకులాలున్నాయి. వీటన్నింటికీ ఎవరు అధికారంలో ఉన్నా న్యాయం చేయటం సాధ్యంకాదు. అలాగే బీసీ జనాభా ఎక్కువున్నది వాస్తవమే అయినా అన్నీ సీట్లు, పదవులు వారికే కట్టబెట్టడం కూడా సాధ్యంకాదు.
అందుకనే ఏ పార్టీ అయినా నిర్దిష్టంగా ఇన్ని సీట్లు బీసీలకు అని నిర్ణయించుకుని దాని ప్రకారమే టికెట్లు కేటాయిస్తుంటాయి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకున్నట్లే అసెంబ్లీ, పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్లు లేవు. కాబట్టి పార్టీల అధినేతల ఇష్టాఇష్టాలు, అవసరాల మీదమాత్రమే బీసీలకు సీట్లు, పదవులు దక్కుతున్నాయి. ఈ పద్దతిని మార్చాలన్నదే బీసీ సంక్షేమ సంఘం నేతల ఆలోచనగా ఉంది. అందుకనే తామే ఓ పార్టీ పెట్టేస్తే ఇక ఏ పార్టీని సీట్ల కోసం బతిమలాడుకోవాల్సిన అవసరం లేదని అనుకుంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కులాల ప్రాతిపాదికగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన ఏ పార్టీ కూడా బతికి బట్టకట్ట అవకాశం లేదు. ఎందుకంటే కులాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఉత్తరాధి రాష్ట్రాల్లో ఉన్నంతగా ఏపిలో లేదు. గతంలో కాపుల కోసం ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీ అనే ప్రయత్నాలు జరిగినా సాధ్యంకాక ఆగిపోయింది. పైగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్టీ పెట్టినంత మాత్రాన ఇప్పటికే ప్రధాన పార్టీల్లో ఉన్న బీసీ నేతలు ఆ పార్టీలని వదిలి పెట్టి బీసీల పార్టీలో చేరుతారని కూడా లేదు.
రాజకీయపార్టీ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళే దెబ్బతిన్నారు. ప్రజారాజ్యంపార్టీని పెట్టిన చిరంజీవి పట్టుమని రెండేళ్ళు కూడా నడపలేక చివరకు కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అలాగే జనసేన పార్టీని పెట్టిన పవన్ కల్యాణ్ పరిస్ధితి ఏమిటో అందరు చూస్తున్నదే. ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు కూడా కొత్త పార్టీ అని చెప్పి ఫెయిలయ్యారు. అచ్చంగా కులాల పునాదుల మీదే రాజకీయపార్టీ పెడితే సక్సెస్ అవ్వటం కష్టమని చరిత్ర చెబుతోంది. మరి బీసీల కోసమని పెట్టబోయే రాజకీయ పార్టీ ఏమవుతుందో చూడాల్సిందే.