Begin typing your search above and press return to search.
'పొలిటికల్ లీడర్ కంటైనర్ లో ఏపీ నుంచి డ్రగ్స్ రవాణా.. అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా?'
By: Tupaki Desk | 9 Sept 2020 10:00 PM ISTకన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. శాండిల్ వుడ్ లో అనేకమంది సినీ నటీనటులు, మ్యూజిషియన్లు నిషేధిత డ్రగ్ యూజర్లేనని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది. బెంగుళూరులోని ఓ హోటల్లో పలువురిని అరెస్టు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వీరు సినీ నటులకు, సంగీత దర్శకులకు, విద్యార్థులకు రకరకాల మత్తు మందులను సప్లయ్ చేస్తారనే సమాచారం రాబట్టారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియా కేసులో కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది - సంజనా లు అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం మరింత మంది నటీనటుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య బెంగళూరు పోలీసులను ఉద్దేశించి చేసిన ట్వీట్ శాండిల్ వుడ్ లో కలకలం రేపింది. 'ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నుంచి కంటైనర్ లో బెంగళూరుకు డ్రగ్స్ వచ్చాయని.. ఆ కంటైనర్ ప్రముఖ రాజకీయ నాయకుడిదని వార్తలు వచ్చాయి.. ఆ రాజకీయ నాయుడిని అరెస్టు చేస్తారా లేదా?' అంటూ రమ్య బెంగళూరు పోలీసులకు ట్వీట్ చేసింది.
కాగా, బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెలలో కోటి రూపాయలకు పైగా విలువైన మరిజువానా డ్రగ్స్ ను నగర శివారల్లోని దేవనహళ్ళి సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్పుడే నటి అనికాతో సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నుంచి మరిజువానా డ్రగ్స్ కంటైనర్ లో లోడ్ చేసుకుని వస్తున్న సమయంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని.. ఆ కంటైనర్ ప్రముఖ రాజకీయ నాయకుడిదని ఓ ఆంగ్లపత్రిక కథనం క్లిప్పింగ్స్ ను జత చేస్తూ రమ్యా ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఓ పొలిటికల్ లీడర్ శాండిల్ వుడ్ ను శాసించాలని చూస్తున్నాడని.. అందుకే ఇండస్ట్రీకి డ్రగ్స్ ను పరిచయం చేశారని.. ఆ పొలిటికల్ లీడర్ తో కొందరు బీజేపీ నాయకులు సన్నిహితంగా ఉన్నారని ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించిందని రమ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇప్పటికే రాగిణి ద్వివేది - సంజనా ల అరెస్ట్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుంటే.. డ్రగ్స్ మాఫియాకు కొందరు రాజకీయ నాయకులకు లింక్ ఉందని రమ్య ఆరోపించడం సంచలనంగా మారింది.