Begin typing your search above and press return to search.

2015 మొత్తాన్ని మూడు ముక్కల్లో చెప్పేస్తే..?

By:  Tupaki Desk   |   31 Dec 2015 4:53 AM GMT
2015 మొత్తాన్ని మూడు ముక్కల్లో చెప్పేస్తే..?
X
మరో ఏడాది.. మరికొద్ది గంటల్లో కాలగర్భంలో కలిసిపోనుంది. ఇవాల్టి వరకూ వర్తమానంగా ఉండే ఏడాది రేపటి నుంచి ‘గతం’గా మారిపోనుంది. 365 రోజుల కాలంలో ఎన్నో గురుతులు.. మరెన్నో సంఘటనలు. మనకు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. మనజీవితాల మీద చెరగని ముద్రలేసివి ఈ ఏడాది కాలంలో ఎన్నో జరిగాయి. సంతోషాలు.. బాధలు.. కష్టాలు.. సుఖాలు.. ఎన్నో సమాహారమైన ఈ ఏడాదికి సంబంధించి సగటు మనిషిపై ప్రభావం చూపిన అంశాలు.. వ్యక్తుల విషయాన్ని సిం‘‘ఫుల్’’గా చెప్పాల్సి వస్తే..

నెంబర్ వన్ భారతీయుడు; తమిళనాడులో పుట్టి.. ప్రపంచాన్నే ప్రభావితం చేసే గూగుల్ సీఈవో స్థానాన్ని చేజిక్కించుకున్న సుందర్ పిచాయే

నెంబర్ వన్ టూరిస్ట్ ; ప్రధాని మోడీ. ఏడాది కాలంలో 37 విదేశీ పర్యటనలు

నెంబర్ వన్ శంకుస్థాపన ; ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన

నెంబర్ వన్ అధ్యాత్మిక కార్యక్రమం; తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత హోదాలో నిర్వహించిన అయుత చండీయాగం

నెంబర్ వన్ కార్యక్రమం; అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తొలిసారిగా జూన్ 21న ప్రపంచ దేశాలు పాటించాయి.

నెంబర్ వన్ నిరాశ; అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ఇచ్చిన కుండెడు మట్టి.. మరో కుండెడు నీళ్ల బహుమతి

నెంబర్ వన్ నిరసన ; దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ మేధావులు.. ప్రముఖులు అవార్డులు తిరిగి ఇవ్వటం

నెంబర్ వన్ క్రైం ; హాలీవుడ్.. బాలీవుడ్ క్రైం కధాంశాల్ని తలపించే ఇంద్రాణి ముఖర్జి. కూతుర్ని చంపేసిన ప్రముఖరాలు

నెంబర్ వన్ షాకింగ్ తీర్పు; హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ కండల వీరుడికి ముంబయి హైకోర్టు ఊరట లభించటం

నెంబర్ వన్ షాకింగ్ సిట్యూవేషన్; గాంధీ ఫ్యామిలీ అమ్మాకొడుకులు నేషనల్ హెరాల్డ్ కేసులో పాటియాలా కోర్టుకు హాజరు కావటం

నెంబర్ వన్ షాకింగ్ న్యూస్; మాజీ రాష్ట్రపతి.. భారతీయుల స్ఫూర్తిప్రదాత అబ్దుల్ కలాం మహా నిష్ర్కమణం

నెంబర్ వన్ భారీ కార్యక్రమం; గోదావరి పుష్కరాలు

నెంబర్ వన్ విషాదం; గోదావరి పుష్కరాల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో తొలిరోజున 27 మంది దుర్మరణం పాలవ్వటం

నెంబర్ వన్ ఫుడ్ వివాదం; గోమాంసం

నెంబర్ వన్ అసహనం; ప్రముఖులు.. మేధావులంతా దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోయిదంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేయటం

నెంబర్ వన్ ప్రకృతి విపత్తు; 18 లక్షల మందిని ప్రభావితం చేసి.. 400పైగా మరణాలకు కారణమైన చెన్నై వరదలు

నెంబర్ వన్ ఎదురుదెబ్బ; మ్యాగీ న్యూడిల్స్ లో మోతాదు మించిన రసాయనాలు

నెంబర్ వన్ చర్చ; బాల నేరస్తుడన్న కారణంగా నిర్భయ దోషిని విడుదల చేయటం

నెంబర్ వన్ శిక్ష అమలు; ముంబయి పేలుళ్లు దోషి మెమన్ ఉరిశిక్ష

నెంబర్ వన్ సినిమా; రూ.500కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన బాహుబలి

నెంబరు వన్ ప్రశ్న; కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?

నెంబర్ వన్ ప్రజాతీర్పు; ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు 67 స్థానాల్లో కేజ్రీపార్టీ సంచలన విజయం

నెంబర్ వన్ ఉచ్చు; ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నోట్ల కట్టలు తెచ్చిన రేవంత్ ను కెమేరాతో బుక్ చేయటం

నెంబర్ వన్ రివర్స్ గేర్; తెలంగాణ సర్కారుపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం