Begin typing your search above and press return to search.

జగన్ రాయని డైరీ ఇప్పుడు రాస్తే బాగుంటుంది

By:  Tupaki Desk   |   25 Sept 2015 7:00 PM IST
జగన్ రాయని డైరీ ఇప్పుడు రాస్తే బాగుంటుంది
X
మక్కాలో చోటు చేసుకున్న దారుణ ఘటన కానీ జరగకుంటే.. గురువారం నాడు చోటు చేసుకున్న రామోజీ.. జగన్ భేటీ తెలుగు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యుండేది. మీడియా మొఘల్ ఇంటికి మరో పవర్ ఫుల్ మీడియా అధినేత అతిధిగా వెళ్లటం.. అందులోనూ వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో కచ్ఛితంగా ఇదో సంచలన వార్త అయ్యేది. కాకుంటే.. గుట్టుగా సాగిపోవటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది.

రామోజీ.. జగన్ భేటీ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చాలానే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే రచ్చ రచ్చగా మారింది. జగన్ ను విపరీతంగా అభిమానించే వారి గొంతులు మూగపోతే.. రామోజీకి అండగా ఉండే వారు మాత్రం చెలరేగిపోయారు. ఇక..జగన్ ప్రత్యర్థుల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీగానే సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మీడియా వర్గాల మధ్య ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. పత్రికలో పలువురు ప్రముఖులకు సంబందించి.. వారు రాయని డైరీ అంటూ ఒక ఫీచర్ పబ్లిష్ చేస్తుంటారు. భావాత్మకంగా రాసే ఈ ఫీచర్ వెరైటీగా ఉండటంతో పాటు.. వారి మనోగతాన్ని తమకు తోచినట్లుగా ఆవిష్కరిస్తూ.. పాఠకుడికి సరికొత్త అనుభూతిని మిగిలుస్తుంటారు.

తాజాగా జరిగిన రామోజీ.. జగన్ భేటీలపై జగన్ రాయని డైరీ పేరుతో రాస్తే ఎంత బాగుండంటూ అత్యాశ పడుతున్న వారు తక్కువేం కాదు. జగన్ రాయని డైరీ కాని రాస్తే ఎంతబాగుండంటూ మీడియా మిత్రుల సంభాషణల్లో కనిపిస్తోంది.