Begin typing your search above and press return to search.

భారీ షాక్; హైదరాబాద్ లో పోలియో వైరస్

By:  Tupaki Desk   |   14 Jun 2016 11:51 AM IST
భారీ షాక్; హైదరాబాద్ లో పోలియో వైరస్
X
కొన్నేళ్ల కిందటే పోలియో వైరస్ ను భారత్ నుంచి తరిమేసినట్లుగా జబ్బలు చరుచుకునే వారికిప్పుడు భారీ షాక్ తగిలిన పరిస్థితి. పోలియో ఫ్రీ ఇండియా అంటూ చెప్పే మాటలకు భిన్నంగా పోలియో వైరస్ కనిపించటం.. అది కూడా హైదరాబాద్ మహానగరంలో కావటం ఇప్పుడు కలకలంగా మారింది. ఇండియా నుంచి తరిమేసినట్లుగా చెప్పుకుంటున్న మాటలకు భిన్నంగా హైదరాబాద్ మురికి నీటిలో పోలియో వైరస్ కనిపించటంతో వైద్యాధికారులు బిత్తర పోతున్నారు.

వెళ్లిపోయిందనుకున్న వైరస్ తిరిగి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు పెద్ద ప్రవ్నగా మారింది. దీంతో.. పోలియో వైరస్ ఎలా వచ్చిందన్న అంశంపై వైద్యులు ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా విదేశీయులు వచ్చినప్పుడు.. వారి నుంచి పోలియోవైరస్ వచ్చి ఉంటుందా? అన్న అభిప్రాయాన్ని వైద్యాధికారులు చెబుతున్నారు.

పోలియో వైరస్ ను కనుగొన్ననేపథ్యంలో మరిన్ని పరిశోధనలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ వైద్య.. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజశ్వర్ తివారీ పరిస్థితిని సమీక్షించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత ప్రమాదకరమైన పోలియో వైరస్ హైదరాబద్ కనిపించిన నేపథ్యంలో కేంద్రం కూడా స్పందించింది. ఈ ప్రమాదకర వైరస్ జాడను తేల్చాలని.. ఎలా వచ్చిందన్న అంశం మీద కూడా దృష్టి పెట్టాలంటూ ఆదేశాల జారీ చేసింది.