Begin typing your search above and press return to search.

స్మగ్లర్ కి వైరస్ పాజిటివ్ ...అధికారుల్లో టెంక్షన్

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:30 PM GMT
స్మగ్లర్ కి వైరస్ పాజిటివ్ ...అధికారుల్లో టెంక్షన్
X
ఏపీలో రోజురోజుకి వైరస్ భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ భయంకరమైన వైరస్ పై ప్రజలకి సరైన అవగాహనా కల్పిస్తూ .. రోజుకు తొమ్మిదివేలకు పైగా టెస్టులు నిర్వహిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా రాష్ట్రంలో కేసుల సంఖ్య విరివిగా పెరిగిపోతుంది. దీనితో రోజురోజుకి వైరస్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచుతుంది. ఇప్పటికే దేశంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

వైరస్ అనుమానితులను క్వారంటైన్ కు తరలిస్తూ, వైరస్ నిర్ధారణ అయిన వ్యక్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వ్యాధి సోకిన వారిని గుర్తించడంలో ప్రభుత్వం వేగంగా పనిచేస్తుండటంతో మరణాల సంఖ్యను వీలైనంత వరకు తగ్గించగలుగుతున్నారు.ఒకరి నుంచి అనేక మందికి వైరస్ సోకుతుండటంతో అలంటి వారిని ట్రేస్ చేయడం ప్రభుత్వానికి, అధికారులకు సవాల్ గా మారింది.

ఇక ఇదిలా ఉంటె, ఇటీవలే చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. అయితే, వైరస్ లక్షణాలు ఉండటంతో వారిని వైరస్ టెస్ట్ నిర్వహించగా ఒకరికి పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు ఆ స్మగ్లర్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీనితో ఇప్పుడు ఆ స్మగ్లర్ ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వైరస్ భయం పట్టుకుంది. త్వరలోనే వీరికి కూడా టెస్టులు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.