Begin typing your search above and press return to search.

ప్రగతి భవన్ సాక్షిగా ఎమ్మెల్యే సీతక్క ఉగ్రరూపం - అరెస్ట్

By:  Tupaki Desk   |   18 Sep 2020 1:10 PM GMT
ప్రగతి భవన్ సాక్షిగా ఎమ్మెల్యే సీతక్క ఉగ్రరూపం - అరెస్ట్
X
ములుగు ఎమ్మెల్యే , కాంగ్రెస్ మహిళా కీలక నేత అయిన సీతక్క ప్రగతి భవన్ వేదికగా ఉగ్రరూపం ప్రదర్శించింది. అన్నదాతల గురించి అసెంబ్లీలో ప్రభుత్వం అసలు చర్చించలేదని, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని సీతక్క తీవ్రంగా మండిపడ్దారు. దానికి నిరసనగా ఆమె కాంగ్రెస్ కిసాన్ విభాగం ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆమెతోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ప్రగతి భవన్ వద్ద కాసేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది.

దీనితో పోలీసులు ఎమ్మెల్యే సీతక్కను , ఆందోళన కారులని అరెస్ట్ చేసారు. ఈ సమయంలో సీతక్క , అక్కడి సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. రైతుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కారు దిగిన సమయంలో తనపై చేయవేసిన మహిళా పోలీస్‌ను సీతక్క హెచ్చరించారు. చేయిఎందుకు వేస్తారని ప్రశ్నించారు. ఈ ముట్టడికి యత్నించిన వారిలో ఎమ్మెల్యే సీతక్కతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కిసాన్ సెల్‌ నేత అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.