Begin typing your search above and press return to search.

ఏడేళ్ల బాలికకి పోలీసుల సమన్లు

By:  Tupaki Desk   |   21 Aug 2020 5:00 AM IST
ఏడేళ్ల బాలికకి పోలీసుల సమన్లు
X
తాము చదివే పాఠశాల భవనం పూర్తిగా పాడైపోయిందని , దానికి వెంటనే మరమ్మత్తులు చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని , కోర్టు మెట్లు ఎక్కిన ఏడేళ్ల బాలికకు , విచారణకి హాజరు కావాలంటూ తమిళనాడు, మీంజూరు పోలీసులు సమన్లు జారీచేయడం పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడేళ్ల భారీ కోర్టు మెట్లు ఎక్కడం ఏంటి .. పోలీసులు సమన్లు జారీచేయడం ఏంటి అని అనుకుంటున్నారా ? అయితే పూర్తిగా చదవండి మీకే అర్థం అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. తిరువళ్లూరు జిల్లాలోని మీంజూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. గోడలు బీటలు వారి ప్రమాదకరంగా మారింది. ఏ క్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఉండడంతో ఆ పాఠశాలలో రెండో తరగతి చదువుకుంటున్న ఏడేళ్ల బాలిక ముత్తరసి స్పందించింది. మరమ్మతులు చేపట్టాలని కోరుతూ కలెక్టర్‌ సహా పలువురు ఉన్నత అధికారులకు విన్నపం చేసింది. అయితే , బాలిక విజ్ఞప్తిని వారు పట్టించుకోకపోవడంతో తన తండ్రి సాయంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాలిక పిటిషన్‌ను విచారించిన కోర్టు పాఠశాలకు ఆరు నెలల్లో మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో స్పందించిన పోలీసులు నిన్న ఉదయం బాలికకు నోటీసులు పంపారు. మీంజూరు పోలీస్ ‌స్టేషన్‌ కు నేరుగా వచ్చి హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.