Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేషన్స్ సెటిల్ మెంట్ల అడ్డాలా ..ఎవరన్నారంటే ?

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:21 AM GMT
పోలీస్ స్టేషన్స్ సెటిల్ మెంట్ల అడ్డాలా ..ఎవరన్నారంటే ?
X
పోలీస్ స్టేషన్స్ ..దేవుడి ఆలయాలతో సమానం. దేవుడి నిలయం తరువాత రక్షణ కానీ , న్యాయం కానీ పోలీస్ స్టేషన్స్ లో మాత్రమే జరుగుతుంది అని అందరూ నమ్ముతారు. కానీ , మారిన పరిస్థితుల కారణంగా .. పోలీస్ స్టేషన్స్ సెటిల్ మెంట్స్ కి అడ్డాగా మారిపోతున్నాయి. అసలు విషయం ఏమిటంటే .. అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించానికి ఉన్న ఏకైక మార్గం ..ల్యాండ్ సెటిల్ మెంట్స్. ఇటీవలే కాలంలో రాజకీయనేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ సెటిల్మెంట్లపై కొంచెం ఎక్కువగా దృష్టిసారించారు. ఈ దందా లో బాధితులైన కొంతమంది పోలీసులని ఆశ్రయిస్తున్నప్పటికీ వారికీ తగిన న్యాయం జరగడంలేదు. ల్యాండ్ సెటిల్ మెంట్స్ లో పరోక్షంగా పోలీసుల ప్రమేయం ఉండడంతోనే మాకు తగిన న్యాయం జరగడంలేదు అని భాదితులు ఆరోపిస్తున్నారు. కానీ , అందరు పోలీసులు , అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఈ సెటిల్ మెంట్ల దందా కొనసాగుతుంది అని చెప్పలేదు. కొన్ని చోట్ల మాత్రమే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఉదంతాలే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

రాజేంద్రనగర్‌‌ నియోజకవర్గ పరిధిలో 2.06 ఎకరాల భూమిలో వివాదంలో ఉంది. ఈ భూమిపై ఓ రాజకీయ నాయకుడు కన్నేశాడు. ఆ వి షయంలో తమకు అనుకూలంగా ఉండే రాజేంద్రనగర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌కు చెందిన ఓ అధికారికి ఫోన్‌‌ చేశాడు. వివాదం ఉన్న భూమిలో ప్రహారి గోడలు నిర్మించుకుంటున్న వ్యక్తులను పిలిపించి ఆ రాజకీయనేతకు భూమిని అమ్మాలని పోలీస్ అధికారి సూచించారు. దీంతో వారు ఏమీ సమాధానం చెప్పలేకపోవడంతో ప్రహారి గోడల నిర్మాణాలను నిలిపివేశారు. ఆ తరువాత సంబంధించిన వ్యక్తులను స్టేషన్కు పిలించి సెటిల్‌‌మెంట్ చేశారు.

అలాగే హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్‌‌నగర్‌‌ మండలానికి చెందిన ఒక చిన్న రైతుకు ఉన్న భూమిని తనకు విక్రయించాలని స్థానిక రాజకీయ నాయకుడు అడిగాడు. దానికి ఆ రైతు సరిగ్గా స్పందించకపోవడంతో , ఆ నేత పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సైతం రైతును ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆ రైతు భూమి విజయవాడ హైవే పక్కనే ఉండడంతో ఆ రాజకీయ నాయకుడు ఆ ల్యాండ్ కావాలని పట్టుబట్టాడు.

ఘట్ కేసర్ మండలం పరిధిలో 25 ఎకరాల భూమి విషయంలో పోలీసులు గ్రేటర్ లోని ఓ ముఖ్య రాజకీయ నేతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూమికి నలుగురు హక్కు దారులు ఉండగా, ఒక హక్కుదారుడి నుంచి భూమి మొత్తాన్ని ప్రభుత్వ పెద్దల్లో ఒకరికి కుడి భుజంగా వ్యవహరించే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు. ఇందుకోసం ఒక వ్యక్తికే 38 ఈ సర్టిఫికెట్ ఇప్పించి అతడి నుంచి భూమి కొనుగోలు చేశారు. దీని పై మిగతా రైతులు అభ్యంతరం చెప్పినప్పటికీ మూడు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిపించేశారు.