Begin typing your search above and press return to search.
రెజ్లర్ సుశీల్ తో పోలీసుల సెల్పీ.. తీవ్ర దుమారం?
By: Tupaki Desk | 27 Jun 2021 9:00 AM ISTదేశానికి రెజ్లింగ్ లో సేవలందించిన ఒలింపిక్ పతకం గెలిచిన గొప్ప క్రీడాకారుడు రెజ్లర్ సుశీల్. అయితే తన ఆవేశంతో తన ప్రియు శిష్యుడినే చావబాదాడు. ఈ దాడిలో సుశీల్ శిష్యుడు సాగర్ ధన్ కర్ చనిపోయాడు. దీంతో హత్య కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు సుశీల్. ఆవేశం అనర్థానికి దారితీసి అతడి గొప్ప కెరీర్ కు ఈ హత్యోదంతం ముగింపు పలికినట్టైంది.
అయితే రెజ్లర్ సుశీల్ కుమార్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. హత్య కేసులో సుశీల్ నిందితుడుగా ఉన్నాడని తెలిసి కూడా ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి.. సుశీల్ తో సెల్ఫీలు దిగినట్టుగా కొన్ని ఫొటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి.. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగుతోంది.
సుశీల్ తో పోలీసుల వ్యవహారశైలి అంటూ కొందరు సర్క్యూలేట్ చేస్తున్నారు.. మాస్కులు లేకుండా.. సోషల్ డిస్టేన్స్ పాటించకుండా సుశీల్ తో నవ్వుతూ అందరూ ఫొటోలు దిగడం తీవ్ర దుమారం రేపింది. ఆ ఫొటో తీసింది కూడా ఓ పోలీస్ కావడం చర్చనీయాంశమైంది.
అయితే ఇది తాజా ఫొటోలనేనా? లేక కరోనా విజృంభణ తర్వాత ఎప్పుడైనా తీశారా? ఫేక్ ఫొటోలా? గతంలో తీసినవా? ఎక్కడ తీశారన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. పోలీసులపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నిందితుడితో ఫొటోలా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే జైలు ప్రాంగణంలోనే ఈ ఫొటో దిగినట్టుగా కనిపిస్తుండడంతో ఇవి లేటెస్ట్ ఫోటోలు అని ప్రచారం సాగుతోంది. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా స్పందించడం లేదు. నిజనిజాలు తెలియాల్సి ఉంది.