Begin typing your search above and press return to search.

వాకింగ్ చేస్తున్న హైదరాబాద్ మెడికోపై పోలీస్ రేప్?

By:  Tupaki Desk   |   6 Sep 2022 7:31 AM GMT
వాకింగ్ చేస్తున్న హైదరాబాద్ మెడికోపై పోలీస్ రేప్?
X
హైదరాబాద్ కు చెందిన వైద్య విద్యార్థిని ఒకరు కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని జిప్మర్ వైద్య విద్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమెకు దారుణమైన అనుభవం ఎదురైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి జిప్మర్ లో ప్రసిద్ధ మెడికల్ కాలేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో విద్యను అభ్యసించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడకు వచ్చి అభ్యసిస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక సదస్సు జరిగింది. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ కు చెందిన మెడికో ఒకరు హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్సుకు తన స్నేహితులతోపాటు ఆమె వెళ్లినట్లుగా చెబుతున్నారు.

సదస్సు అయ్యాక రాత్రి వేళలో వాకింగ్ చేస్తున్న సదరు వైద్య విద్యార్థిని (21) వద్దకు స్థానిక కానిస్టేబుల్ అతని స్నేహితుడు వచ్చారు. ఆడిటోరియం వద్ద చోటు చేసుకున్న ఈ షాకింగ్ పరిణామంలో.. కానిస్టేబుల్ అతని స్నేహితుడు బాధితురాలిని బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగికవేధింపులకు ప్రయత్నించారు. అప్పటివరకు తమతో ఉన్న స్నేహితురాలు ఒక్కసారిగా కనిపించకపోవటంతో ఆమె స్నేహితులు గాలించారు.

ఆ క్రమంలో పార్కింగ్ స్టాండ్ వద్ద తమ స్నేహితురాలిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న దృశ్యాలను చూసి పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. దీంతో.. ఆ ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని పుదుచ్చేరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే స్పందించిన వారు ఆ యువతిని జిప్మర్ కు తరలించారు. ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించిన వ్యక్తుల్ని గుర్తించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించారు. వేధింపులకు ప్రయత్నించిన వ్యక్తి 31 ఏళ్ల జిప్మర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కన్నన్ గా.. మరొకరు అతడి స్నేహితుడు 20 ఏళ్ల శివగా గుర్తించారు.

ఈ ఉదంతం తర్వాత వారు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. తాజాగా వారిని ట్రేస్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పర్చారు. దీంతో వారికి రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైద్య విద్యార్థిని లైంగిక వేధింపులకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంలో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. పోలీసులు వివరాల్ని ఇచ్చే విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో.. లైంగిక వేధింపులకు ప్రయత్నం జరిగిందా? లైంగిక వేధింపులు జరిగాయా? అన్న దానిపై స్పష్టత రావట్లేదు. ఏమైనా.. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. రక్షణ కల్పించాల్సిన కానిస్టేబుల్.. అందుకు భిన్నంగా కాటేయాలని చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు