Begin typing your search above and press return to search.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అరెస్ట్ అయిన నలుగురు మహిళలు
By: Tupaki Desk | 1 Nov 2020 5:00 AM ISTపేకాట, పబ్బులంటే మగాళ్లు చెవి కోసుకుంటారు. పట్టణాల్లో ఉండేవారైతే వీటికి తరుచుగా వెళుతుంటారు. అయితే మగాళ్లకే ఈ సౌకర్యాలా..? తాము కూడా ఇందులో తీసిపోమని మహిళా మణులు నిరూపించారు.
తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఒక ఇంటిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేశారు.
ఇందులో చూస్తే పోలీసులే ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈ పేకాట స్థావరంలో పెద్ద బిజినెస్ మ్యాన్ లు చిక్కడం విశేషం. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉండడం చూసి పోలీసులే ముక్కన వేలేసుకున్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.
అరెస్ట్ వారిలో 4 మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. ఇందులో అంబర్ పేటకు చెందిన కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కూడా ఉండడం గమనార్హం. వీరి నుంచి సెల్ ఫోన్లు , 3.45 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా వెంకటగిరిలోని ఒక నివాసంలో పేకాట స్థావరాన్ని మహిళలే ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోంది.