Begin typing your search above and press return to search.

సీఎం స్పీచ్ బోర్‌..క్యాండీ క్ర‌ష్‌ తో హుషార్‌!

By:  Tupaki Desk   |   29 Jun 2017 8:11 AM GMT
సీఎం స్పీచ్ బోర్‌..క్యాండీ క్ర‌ష్‌ తో హుషార్‌!
X
అసెంబ్లీ - పార్ల‌మెంటు స‌భలు జ‌రుగుతున్న‌పుడు కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ మొబైల్ ఫోన్ల‌లో పోర్న్ వీడియోలు చూసిన ఘ‌ట‌న‌ల గురించి వినే ఉంటారు. ప్ర‌జా ప్ర‌తినిధుల క‌న్నా తామేం త‌క్కువ కాదంటున్నారు బీహార్ పోలీసులు. అయితే వీరు పోర్న్ గ‌ట్రా చూడ‌లేదు. కానీ, సీరియ‌స్ గా శాంతి భ‌ద్ర‌త‌ల‌ స‌ద‌స్సు జ‌రుగుతున్న స‌మ‌యంలో స‌ర‌దాగా మొబైల్‌లో గేమ్స్ ఆడారు. ఆ పోలీసుల నిర్వాకం కెమెరా కంటికి చిక్క‌డంతో వారిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

బీహార్‌ లో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించిన పోలీసుల స‌ద‌స్సును డీజీపీ ఠాకూర్ శ‌నివారం నిర్వహించారు. ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఒకవైపు సీఎం - డీజీపీ సీరియస్‌ గా భ‌ద్ర‌తా పాఠాలు బోధిస్తున్నారు. మ‌రోవైపు.. ఇవేమీ ప‌ట్ట‌న‌ట్లు కొంత‌మంది పోలీసులు ఎంచ‌క్కా తమ మొబైల్ ఫోన్ల‌లో క్యాండీ క్రష్‌ గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేశారు. ఈ త‌తంగం కెమెరా కంటికి ఇక్క‌డంతో వారి ఆట‌లు వెలుగులోకి వ‌చ్చాయి.

సీఎం - డీజీపీ ల ప్రసంగాలు పోలీసులకు బోర్ కొట్టించిన‌ట్లున్నాయి. అందుకే, కొంద‌రు పోలీసు అధికారులు క్యాండీ క్ర‌ష్ ఆడితే, మ‌రి కొందరు సోషల్‌ మీడియా ఖాతాలు చెక్ చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన భార్య మెలానియా గురించి వచ్చిన జోకులు చూస్తూ గడిపారు.

సాక్ష్యాత్తు సీఎం - పోలీస్ బాస్‌ పాల్గొన్న స‌ద‌స్సులో పోలీసుల వ్య‌వ‌హార శైలిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌రి, ఈ వ్య‌వ‌హారంపై సీఎం నితీష్ కుమార్ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/