Begin typing your search above and press return to search.
క్యూనెట్ కేసు: సెలబ్రెటీలకు మరోసారి నోటీసులు
By: Tupaki Desk | 2 Aug 2019 3:38 PM ISTచైన్ బిజినెస్ పేరుతో తక్కువ డబ్బు కడితే ఎక్కువ ఇస్తామని ఆశచూపి ‘క్యూనెట్’ అనే సంస్థ దాదాపు రూ.3వేల కోట్లు వసూలు చేసి మోసం చేసింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రెండు రోజుల క్రితం క్యూనెట్ బాధితుడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ కేసును సైబర్ క్రైం పోలీసులు స్పీడప్ చేశారు. తాజాగా 500మందికి నోటీసులను పంపించారు.
క్యూనెట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన ప్రముఖులకు మరోసారి పోలీసులు నోటీసులు అందించారు. క్యూనెట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన బాలీవుడ్- టాలీవుడ్ స్టార్లను పోలీసులు గుర్తించారు. మొత్తం ఏడుగురు సినిమా తారలకు నోటీసులు పంపించినట్టు తెలిసింది..
తాజాగా నోటీసులు అందుకున్న వారిలో బోమన్ ఇరానీ- వివేక్ ఒబెరాయ్- అనిల్ కపూర్- జాకీష్రాఫ్- పూజాహెగ్డె- షారుఖ్ ఖాన్ లాంటి తారలు ఉన్నట్టు సమాచారం. తెలుగులో బిజీగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డెకు ఈ నోటీసులు వచ్చాయన్న వార్త టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇక కేసులో ఇదివరకు నోటీసులు అందుకున్న అల్లు శిరీష్ కు నోటీసులు అందాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.