Begin typing your search above and press return to search.

శ్రీ‌నివాస్ య‌జ‌మాని హ‌ర్ష విచార‌ణ‌లో ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   28 Oct 2018 4:41 AM GMT
శ్రీ‌నివాస్ య‌జ‌మాని హ‌ర్ష విచార‌ణ‌లో ఏం చెప్పారు?
X
సంచ‌ల‌నం.. అంత‌కు మించిన షాకింగ్ గా మారింది ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ పై జ‌రిగిన క‌త్తి దాడి ఉదంతం. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మార‌టం అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య తీవ్ర‌మైన మాట‌ల యుద్ధం సాగుతోంది. మ‌రోవైపు ఏపీ పోలీసులు జ‌గ‌న్ పై దాడి ఉదంతంపై త‌మ‌దైన శైలిలో విచార‌ణ జ‌రుపుతున్నారు.

జ‌గ‌న్ పై దాడికి పాల్ప‌డిన శ్రీ‌నివాస్ ప‌ని చేసే ఫ్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్ య‌జ‌మానిని పోలీసులు విచార‌ణ‌కు పిలిచారు. అయితే.. ఆయ‌న టీడీపీ విశాఖ అర్బ‌న్ జిల్లా ఉపాధ్యక్షుడిగా చెవుతున్నారు. దీంతో లోతుగా విచారించాల్సి ఉన్నా.. పెద్ద‌గా ఒత్తిడి లేకుండా నాలుగైదు ప్ర‌శ్న‌లు వేసి పంపిన‌ట్లుగా తెలుస్తోంది. విప‌క్ష నేత‌పై ఎయిర్ పోర్ట్ లో క‌త్తి దాడి జ‌రిగిన‌ప్పుడు నిందితుడ్ని అదుపులోకి తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.

అదే స‌మ‌యంలో నిందితుడు ప‌ని చేసే సంస్థ య‌జ‌మాని ఎవ‌రు? అత‌డి నిర్వ‌హ‌ణలో ఉన్న షాపులో ప‌ని చేసే కుర్రాడు ఇలాంటి ప‌ని చేయ‌టం ఏమిటి? అత‌డి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార శైలి ఎలా ఉంటుంది? లాంటి ప్ర‌శ్న‌ల్ని ముందే సేక‌రించి పెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ.. అదేమీ లేకుండా నిందితుడు ప‌ని చేసే రెస్టారెంట్ య‌జ‌మాని హ‌ర్ష ను విచార‌ణ అధికారులు విచార‌ణ జ‌ర‌ప‌క‌పోవటంపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో హ‌ర్ష‌ను విచార‌ణ‌కు పిలిచిన అధికారులు తూతూ మంత్రంగా ప్ర‌శ్న‌లు వేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది ఆయ‌న స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన అధికారులు శ్రీ‌నివాస్ కు సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు వేసిన‌ట్లుగా చెబుతున్నారు. చివ‌ర్లో ఆయ‌న స్టేట్ మెంట్ ను తీసుకొన్న పోలీసులు మ‌రోసారి పిలుస్తామ‌ని.. అప్పుడు రావాల‌ని కోరారు.

ఇదిలా ఉంటే జ‌గ‌న్ పై దాడికి సంబంధించి అన్ని వివ‌రాల‌తో కూడిన లేఖ‌ను రాసిన‌ట్లుగా శ్రీ‌నివాస్ చెప్ప‌టం తెలిసిందే. అయితే.. ఆ లేఖ మొత్తం 11 పేజీల్లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇంట‌ర్ పూర్తి చేయ‌ని ఒక నిందితుడు 11 పేజీల సుదీర్ఘ లేఖ‌ను రాసే అవ‌కాశం లేద‌ని చెప్పాలి. .

జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం కేసులో విచార‌ణ జ‌రుపుతున్న ఎయిర్ పోర్ట్ పోలీసుల తీరుతో పాటు.. నార్త్ జోన్ ఏసీపీ లంకా అర్జున్ తీరు ఏ మాత్రం బాగోలేద‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. అధికార‌ప‌క్షానికి అనుకూలంగా ఆయ‌న ప‌ని తీరు ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. మ‌రి.. ఈ విష‌యంపైనైనా ఉన్న‌తాధికారులు క‌లుగ‌జేసుకుంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.