Begin typing your search above and press return to search.

నటిని వేధింపులకు గురి చేసినోడ్ని పట్టేసుకున్న పోలీసులు

By:  Tupaki Desk   |   8 May 2022 10:27 AM IST
నటిని వేధింపులకు గురి చేసినోడ్ని పట్టేసుకున్న పోలీసులు
X
సైబర్ నేరగాళ్లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సాయంతో.. తన మెదడును తప్పుడు మార్గాల్లోకి వెళ్లేలా చేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరి ఆరాచకాల్ని వింటే నిజమా? అన్న విస్మయానికి గురి కాక మానదు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెర మీదకు వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటి ఫోన్ నెంబర్ ను సేకరించాడో ప్రబుద్ధుడు. స్టార్ మేకర్స్ యాప్ ద్వారా ఆమె ఫోన్ నెంబరును సేకరించిన అతడు.. ఆమెను పెట్టిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదంటున్నారు.

ఆమెకు అసభ్య పదజాలంతో వాయిస్ మెసేజ్ లతో పాటు.. ఆమెకు ఫోన్ చేసి ఆమె న్యూడ్ ఫోటోలు తన దగ్గర ఉన్నాని.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించేవాడు. లేదంటే.. తాను చెప్పినట్లుగా నడుచుకోవాలంటూ మనో వేదనకు గురి చేసేవాడు. ఈ రకంగా ఆ నటికి నరకాన్ని చూపించినట్లుగా చెబుతున్నారు.

దీంతో విసిగిపోయిన ఆ నటి.. షీ టీమ్స్ ను సంప్రదించింది. తనకు ఎదురవుతున్న టార్చర్ ను వారికి వెళ్లబోసుకుంది. తనకు సాయం చేయాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. నిజానికి ఇలాంటి చేదు అనుభవం సెలబ్రిటీలకు మాత్రమే కాదు.. కొంతమంది అమ్మాయిలకు ఎదురవుతూ ఉంటుంది. అలాంటి వారు భయానికి లోనుకాకుండా..టెన్షన్ పడకుండా పోలీసులకు సమాచారం ఇచ్చినా.. కంప్లైంట్ చేసినా స్పందించి వారికి కలిగే అసౌకర్యాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. తాజాగా ఈ నటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది.