Begin typing your search above and press return to search.

షాక్: ఫృథ్వీషాను అడ్డుకున్న పోలీసులు

By:  Tupaki Desk   |   15 May 2021 4:30 AM GMT
షాక్: ఫృథ్వీషాను అడ్డుకున్న పోలీసులు
X
టీమిండియా యువ ఆటగాడు ఫృథ్వీషాకు చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలో లాక్ డౌన్ అమల్లో ఉండడడంతో అధికారుల అనుమతి లేకుండా గోవాకు వెళుతున్న ఫృథ్వీ షాను పోలీసులు అడ్డుకున్నారు.

ఫృథ్వీషాను అంబోలీ జిల్లా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కరోనా సెగతో ఐపీఎల్ 14వ సీజన్ ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ముంబైలోని ఇంట్లోనే ఫృథ్వీ షా ఉంటున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫృథ్వీషా హోం ఐసోలేషన్ ను ఇటీవలే పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కు ఫృథ్వీ అర్హత సాధించలేకపోవడంతో ఈ ఖాళీ టైంలో గోవాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. విమానాలు లేకపోవడంతో కారులో బయలుదేరాడు.

కరోనా విజృంభిస్తున్న వేల మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్న ఈ-పాస్ ఉంటేనే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అయితే ఫృథ్వీ షా వద్ద పాస్ లేకపోవడంతో అంబోలీ జిల్లా చెక్ పోస్టు వద్ద పోలీసులు అతడి కారును అడ్డుకున్నారు. గోవాకు పాస్ లేనిదే పంపమన్నారు. గంటపాటు వేచి ఉండి.. తన మొబైల్ నుంచి ఈపాస్ అప్లై చేశాడు. అనుమతి వచ్చిన తర్వాత పోలీసులు ఒప్పుకున్నారు.

ఆస్ట్రేలియాలో విఫలమైన ఫృథ్వీ షా ఇటీవల విజయ్ హాజారే ట్రోఫీతోపాటు ఐపీఎల్ లో అదరగొట్టాడు. కరోనా కల్లోలంతో ఐపీఎల్ కు బ్రేక్ తో గోవా వెళ్లేందుకు బయటకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.