Begin typing your search above and press return to search.

సానియామీర్జా కారుకు చలానా పడింది

By:  Tupaki Desk   |   11 Aug 2015 4:46 AM GMT
సానియామీర్జా కారుకు చలానా పడింది
X
వరుస సంచలన విజయాలతో దూసుకెళుతూ.. వివాదాలకు దూరంగా కాలం గడుపుతున్న ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా ఊహించని ఒక అంశంతో వార్తల్లోకి వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆమె కారు నెంబరు ప్లేట్ అంశంలో చలానాకు గురయ్యారు.

తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో..ఆమె కారుకు చలానా విధించారు. సానియా పేరు మీదున్న టొయోటో ఫార్చ్యూనర్ టీఎస్ 09 ఈజీ 1 నెంబరున్న వాహనం.. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 10లోని పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంది. అంతాబాగానే ఉన్నా.. కారు నెంబరు ప్లేట్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవటంతో సదరు కారుకు రూ.200 చలానా విధించారు.

అనంతరం ఈ కారు యజమాని ఎవరన్న అంశంపై దృష్టి పెట్టిన వారికి అది.. ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా పేరు మీద ఉన్నట్లుగా చెబుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని నెంబరు ప్లేటుతో సానియా పేరు వార్తల్లోకి వచ్చింది.