Begin typing your search above and press return to search.
వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: న్యాయ నిపుణులు
By: Tupaki Desk | 13 March 2021 7:00 AM ISTఇప్పుడు ఎక్కడ చూసినా సాయంత్రం అయ్యిందంటే చాలు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులే. తాగి వాహనం నడిపితే ఇక జైలుకు వెళ్లాల్సి రావడంతోపాటు వాహనాన్ని కూడా వదులుకోవాల్సిందే. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన వేల వాహనాలు ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాయి.
అయితే తాజాగా ఈ చట్టాలపై న్యాయ నిపుణులు స్పందించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో దొరికితే వాహనం సీజ్ చేయాలని ఎక్కడా లేదని అంటున్నారు. చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని న్యాయనిపుణులు అసలు విషయాన్ని బయటపెట్టారు.
తాజాగా ఇది ఓ వ్యక్తి బయటపెట్టాడు. పంజాగుట్టలో వెంకటేశ్ కు చెందిన వాహనాన్ని డ్రంకెన్ డ్రైవ్ పేరుతో పోలీసులు సీజ్ చేశారు. అంతటితో ఆగకుండా రోజుల తరబడి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. దీనిపై వెంకటేశ్ హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏ అధికారంతో వాహనాన్ని సీజ్ చేశారని.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని సీజ్ చేయాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలే తప్పా.. వాహనం సీజ్ చేసి ఇబ్బందులకు గురిచేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
ఇక బ్రీత్ ఎనలైజర్ తప్పుగా చూపించి చాలా మంది మద్యం తాగకున్నా తాగినట్టు చూపించిందని కోర్టుకు వెళ్లిన వారు ఉన్నారు. దీనిపైన కూడా పిటీషన్లు దాఖలయ్యాయి.