Begin typing your search above and press return to search.

ఆ రెండు అత్యాచార ఘ‌ట‌న‌లు ఫేక్‌!: సీపీ అంజ‌నీ కుమార్

By:  Tupaki Desk   |   20 Aug 2021 7:45 AM IST
ఆ రెండు అత్యాచార ఘ‌ట‌న‌లు ఫేక్‌!:  సీపీ అంజ‌నీ కుమార్
X
కొన్ని రోజుల వ్య‌వ‌ధిలో హైద‌రాబాద్‌లో వెలుగు చూసిన‌.. రెండు అత్యాచార ఘ‌ట‌న‌లు హైద‌రాబాద్‌ను కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఒక‌టి గాంధీ ఆసుప‌త్రిలోను, రెండోది సంతోష్ న‌గ‌ర్‌లోనూ జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన హైద‌రాబాద్ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసు బృందాల‌ను కూడా రంగంలోకి దింపారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు షాకింగ్ విష‌యాలు తెలిశాయి. అస‌లు ఆ రెండు ఘోరాలు జ‌ర‌గ‌లేద‌ని.. అవి జ‌రిగిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు కూడా నిరాధార‌మ‌ని గుర్తించారు.

ఈ విష‌యంపై పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ మీడియాతో మాట్లాడారు. ``ఈ రెండు ఘ‌ట‌న‌ల‌ను తీవ్రంగా భావించాం. ఆయా ప్రాంతాల్లోని దాదాపు 500 సీసీ టీవీ కెమెరాల‌ను ప‌రిశీలించి.. 800 గంట‌ల ఫుటేజ్‌ను ప‌రిశీలించాం. ఈ క్ర‌మంలోనే సుమారు 200 మంది సాక్షుల‌ను కూడా విచారించాం. ఈ క్ర‌మంలో మాకు తెలిసింది ఏమంటే.. ఈ రెండు ఘ‌ట‌న‌లు ఫేక్‌. ఈ రెండు కేసుల్లోనూ ఎలాంటి ర‌హ‌స్యం లేదు. దీనికి సంబంధించి హైకోర్టులో రెండు రోజుల్లో పిటిష‌న్ వేయ‌నున్నాం`` అని వివ‌రించారు.

ఇక‌, మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌ను ప‌రిశీలిస్తే.. సంతోష్‌న‌గ‌ర్ ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ మ‌హిళ ఉద్దేశ పూర్వ‌కంగానే కేసు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. త‌న బోయ్ ఫ్రండ్ త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి చేస్తుండ డంతో ఇలా కేసు పెట్టిన‌ట్టు తేల్చారు. ఇక‌, కేసులో మాత్రం.. త‌న‌ను ముగ్గురు ఆటో డ్రైవ‌ర్లు ఓ నిర్జ‌న ప్రాం తానికి తీసుకువెళ్లి.. అత్యాచారం చేశార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు చెప్పిన ప్రాంతానికి వెళ్లి.. సైంటిఫిక్ ఆధారాల‌ను, టెక్నిక‌ల్ సాక్ష్యాల‌ను కూడా ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో ఈ రేప్ ఘ‌ట‌న న‌కిలీదేన‌ని స్ప‌ష్టం చేశారు. ఉద్దేశ పూర్వ‌కంగా.. కేసుపెట్టిన‌ట్టు తేల్చారు.

ఇక‌, గాంధీ హాస్ప‌ట‌ల్‌లో అత్యాచారం జ‌రిగిన‌ట్టు అందిన ఫిర్యాదుపైనా పోలీసులు త‌క్ష‌ణ‌మే స్పందించారు. గురువారం వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. దీనికి సంబంధించిన వివ‌రాలు చూస్తే.. ఇద్ద‌రు అక్కాచెల్లెళ్ల‌పై అత్యాచారం జ‌రిగిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే.. అక్క భ‌ర్త‌ను ఈ నెల 8న గాంధీ ఆసుప‌త్రిలో జాయిన్ చేశారు. త‌ర్వాత ఐదు రోజుల వ‌ర‌కు అక్క‌డే ఉండాల్సి వ‌చ్చింది. అయితే.. ఈ క్ర‌మంలో అక్కాచెల్లెళ్లు త‌మ‌కు అల‌వాటున్న తాటిక‌ల్లు తాగ‌లేక పోయారు. దీంతో మాన‌సికంగా.. ఇబ్బంది ప‌డ్డారు.

దీంతో ఒకానొక స‌మ‌యంలో అప‌స్మార‌క స్థితికి చేరుకున్నారు. వీరిద్ద‌రి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అక్క‌.. గాంధీ ఆసుప‌త్రి నుంచి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలో కంగారు ప‌డిన చెల్లెలు.. త‌న అక్క‌పై ఏదో జ‌రిగిందంటూ.. పోలీసుల‌కు.. ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన‌.. ప‌ది బృందాలు.. గాంధీ ఆసుప‌త్రి ఘ‌ట‌న మిస్ట‌రీని ఛేదించారు. ఈ క్ర‌మంలో అటు సంతోష‌న‌గ‌ర్ ఘ‌ట‌న‌, ఇటు గాంధీ ఘ‌ట‌న రెండూ కూడా.. ఫేకేన‌ని తేల్చారు.