Begin typing your search above and press return to search.

ఇప్పటినుండి పెళ్లిళ్లకి పోలీసులు కూడా వస్తారు .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   24 Nov 2020 4:50 PM GMT
ఇప్పటినుండి పెళ్లిళ్లకి పోలీసులు కూడా వస్తారు .. ఎందుకంటే ?
X
కరోనా మహమ్మారి పుణ్యమా అని అందరి జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి జోరు తగ్గిందిలే అనుకోని , నియమాలు పాటించండి అంటూ లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తే , కరోనా లేదు అంటూ ఇష్టానుసారంగా తిరగడం , కరోనా నిబంధనలు పాటించకపోవడంతో మళ్లీ కొంచెం కొంచెం గా కరోనా జోరు పెరుగుతుంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే , మన దేశంలో కూడా కరోనా జోరు మళ్లీ పెరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

ఇలాంటి తరుణంలో హర్యానాలోని గురుగ్రామ్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటి అంటే ... అక్కడ జరిగే పెళ్లిళ్ల కి పోలీసులు కూడా హాజరుకాబోతున్నారు. సాధరణంగా వివాహ వేడుకలు ఆహ్వానం లేకుండా వెళ్లరు. కానీ, ఆహ్వానం లేకుండానే పోలీసులు అధికారికంగా వెళ్లే పరిస్థితిని కరోనా సృష్టించింది. గురుగ్రామ్‌ పోలీసు కమిషనర్‌ కెకె రావు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నగరంలో జరిగే వివాహ వేడుకలకు పోలీసులు హాజరవుతారు. అతిథులను తనిఖీ చేసి, మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తారని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. హర్యానాలో కేసులు పెరగుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే , కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గురుగ్రామ్‌లోని అధికారులు ఢిల్లీ నుంచి నగరంలోకి వచ్చే వ్యక్తులకు పరీక్షలు చేస్తున్నారు.