Begin typing your search above and press return to search.

ఆ ముసలోడి న్యూడ్ బాగోతం.. పోలీసుల చెక్

By:  Tupaki Desk   |   9 Nov 2020 6:00 AM IST
ఆ ముసలోడి న్యూడ్ బాగోతం.. పోలీసుల చెక్
X
పుర్రెకో బుద్ది అంటారు.. అది పుట్టుకతో వచ్చింది చచ్చే వరకు పోదంటారు. ఇప్పుడు ఓ పెద్దాయన కూడా అలానే వ్యవహరిస్తున్నాడు. లేటు వయసులో ఘాటు వేశాలు వేస్తున్నాడు. నోటికొచ్చిన నంబర్ కు తన న్యూడ్ ఫొటోలను పంపి ఆనందిస్తున్నాడు. ఇదే పాడుబుద్దో కానీ చివరకు చిక్కాడు.

కర్ణాటకలోని చల్లకెరెకి చెందిన రామకృష్ణ(54) అంత లేటు వయసులో ఘాటు చేష్టలు చేస్తున్నాడు. వికృత చేష్టలతో మహిళలనే కాదు.. పురుషులకు చిరాకు తెప్పిస్తున్నాడు.

రామకృష్ణ నోటికొచ్చిన నంబర్లకు డయల్ చేస్తాడు. అనంతరం అమ్మాయి మాట్లాడినా.. అబ్బాయి మాట్లాడిన రింగ్కాగానే ఆ నంబర్లకు తన న్యూడ్ ఫొటోలను పంపుతాడు.

ఇలా ఇప్పటిదాకా 120 మంది మహిళలకు తన న్యూడ్ ఫొటోలను పంపాడు. అనంతరం స్విచ్ఛాఫ్ చేసుకునేవాడు..

ఇన్నాళ్లుగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంతకాలం ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. 4 రోజుల క్రితం తిరిగి ఫోన్ ను ఆన్ చేయడంతో ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ముసలాడి ఆట కట్టైంది.