Begin typing your search above and press return to search.

వాహనదారులకు అలర్ట్ ..ఇకపై ఆలా చేస్తే 420 కేస్ !

By:  Tupaki Desk   |   13 Jun 2020 1:00 PM GMT
వాహనదారులకు అలర్ట్ ..ఇకపై ఆలా చేస్తే 420 కేస్ !
X
ఇకపై మీరు రోడ్డెక్కే సమయంలో ఒకసారి మీ బండి నెంబర్ ప్లేట్ ను సరిచూసుకోండి. లేకపోతే చట్ట ప్రకారంగా 420 కేసు నమోదవుతుంది. వాహన నంబర్ ప్లేటు సరిగ్గా లేకపోయినా ఆ నంబర్ ప్లేటులో అక్షరాలు, సంఖ్యలను తుడిసేసినా సరిగ్గా రాయకున్నా, ప్లేటును వంచినా, ట్రాఫిక్ పోలీసులను చూసినప్పుడు వాటిని కనపడకుండా చేసినా, నంబర్ సంఖ్యలో ఒక నంబర్‌ను కనపడకుండా చేసినా, నంబర్లు సరిగ్గా కనపడకుండా చేసినా, తప్పుడు నంబర్ ప్లేటు పెట్టుకున్నా, ఇక ట్రాఫిక్ పోలీసులు వాటిపై 420(మోసం), 465(ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కోర్టు విచారణలో తప్పు అని నిర్ధారణ అయితే 420 సెక్షన్ కింద 7 ఏళ్ళు, 465 కింద 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడుతుంది. దీనితో వాహనదారులు తమ నంబర్ ప్లేటు స్పష్టంగా కనపడేలా ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేసారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 12,314 మంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు వంచి, కనపడకుండా తిరిగారని గుర్తించారు. వీరందరీపై సాధారణ చలాన్‌తో పాటు సెక్షన్ 420, 465ల కింద కేసులు నమోదు చేశారు.

చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి వారి చలానాల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేటు కనపడకుండా చేస్తున్నారు. అయితే అలాంటి వారిని ఫొటోల రూపంలో, సీసీ కెమెరాల రూపంలో పట్టుకుని వారి తప్పు రుజువైతే ఐసీపీ సెక్షన్‌లు 420, 465 కింద జైలు ఊచలు లెక్కించాల్సిందేనని అంటున్నారు. ఎవరైనా నగరవాసులు ఇలాంటి నెంబర్‌ ప్లేట్లతో కూడిన వాహనాలను గుర్తిస్తే ఆ ఫొటోలు తీసి పోలీసు అధికారిక వాట్సాప్‌ నెంబర్‌ 9490616555కు పంపాలని కోరుతున్నారు.